ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయం చేయాలనుకుంటే ఖబడ్దార్: మంత్రి సురేష్

ABN, First Publish Date - 2021-11-09T23:32:34+05:30

రాష్ట్రంలోని పిల్లలతో రాజకీయం చేయాలనుకుంటే ఖబడ్దార్ అని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విజయవాడ: రాష్ట్రంలోని పిల్లలతో రాజకీయం చేయాలనుకుంటే ఖబడ్దార్ అని మంత్రి ఆదిమూలపు సురేష్ హెచ్చరించారు. నీకు ఎయిడెడ్ వ్యవస్త గురించి అసలు తెలుసా అని టీడీపీ నాయకుడు లోకేష్‌ను ప్రశ్నించారు. పిల్లల జీవితాలతో ఆటలాడుతారా అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేసారు. కాకినాడ,వైజాగ్‌లో పేరెంట్స్‌తో ధర్నాలు చేయించారన్నారు. గ్రాంట్ ఇన్ ఎయిడ్ విషయంలో ఎవరితో ఆయినా చర్చలకు సిద్ధమని ఆయన ప్రకటించారు. తనను అడ్డుకొన్నవారు అసలు విద్యార్థులో, కాదో అని ఆయన అనుమానం వ్యక్తం చేసారు. రాజకీయ ఎజెండాలకు ఎవరూ బలి కావద్దన్నారు.


అనంతపురం ఘటన టీడీపీ కుట్రలో భాగమేనని ఆయన ఆరోపించారు. కోవిడ్‌లో పరీక్షలు వద్దని అడ్డుకున్నారన్నారు. యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామంటే చంద్రబాబు ఒప్పుకోవడం లేదన్నారు. విద్యార్థుల భవిష్యత్ కోసం ధర్నాలు మంచిది కాదన్నారు. సంస్కరణల్లో భాగంగానే ఇలాంటి నిర్ణయం తీసుకున్నామన్నారు. కొన్ని సంస్థల్లో అక్రమాలు జరిగాయన్నారు. నిన్న జరిగిన ఘటనను ఖండిస్తున్నానన్నారు. విద్యార్థుల ముసుగులో కొందరు రాళ్లు విసిరారని ఆయన ఆరోపించారు. రాళ్లు తగలడం వల్ల విద్యార్థులు గాయపడ్డారని, కానీ లాఠీచార్జి జరగలేదని మంత్రి సురేష్ తెలిపారు. 


Updated Date - 2021-11-09T23:32:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising