ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పరీక్షలపై సుప్రీంకోర్టు నిర్ణయాన్ని పాటిస్తాం: మంత్రి అదిమూలపు

ABN, First Publish Date - 2021-06-23T02:49:26+05:30

రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని మంత్రి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలో జరిగే పరీక్షలపై సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. సుప్రీంకోర్టులో ఏపీ, కేరళ రాష్ట్రానికి సంబంధించి పది, ఇంటర్ పరీక్షల నిర్వహణపై వాదనలు జరిగాయని మంత్రి సురేష్ పేర్కొన్నారు. రాష్ట్రాలపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిందనడం సరికాదని మంత్రి ఆదిమూలపు సురేష్‌ తెలిపారు. పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఏమిటని సుప్రీంకోర్టు అడిగిందని సురేష్‌ పేర్కొన్నారు. పరీక్షలు ఎలా నిర్వహిస్తామన్నది స్పష్టంగా తెలియజేశామని మంత్రి  సురేష్‌ వివరించారు. గదికి 15 మంది విద్యార్థులు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. విద్యార్థికి, విద్యార్థికి మధ్య 5 అడుగుల భౌతికదూరం పాటిస్తూ ఐసొలేషన్‌ రూమ్స్, కొవిడ్ ప్రోటోకాల్ పాటిస్తూ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పామని ఆయన పేర్కొన్నారు. 


ఎంసెట్ పరీక్షలకు సంబంధించి ఇంటర్ పరీక్షలను ఎలా పరిగణనలోకి తీసుకుంటామో కోర్టుకు వివరించామన్నారు. పదో తరగతిలో గ్రేడ్‌ల విషయంపైనా కోర్టుకు తెలియజేశామన్నారు. కేవలం గ్రేడ్‌లు మాత్రమే ఇస్తున్నామని, మార్కులు కాదని సుప్రీంకోర్టుకు తెలిపామని ఆయన చెప్పారు. ఈ వివరాలన్నింటిని అఫిడవిట్ ద్వారా తెలపాలని, విచారణను గురువారానికి సుప్రీంకోర్టు వాయిదా వేసిందని ఆయన పేర్కొన్నారు. పరీక్షల విషయంలో సుప్రీంకోర్టు ఏ నిర్ణయం ప్రకటించినా పాటిస్తామని మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు.


Updated Date - 2021-06-23T02:49:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising