ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నాం: మంత్రి ఆదిమూలపు

ABN, First Publish Date - 2021-08-25T21:00:01+05:30

పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: పద్మావతీ మహిళా విశ్వవిద్యాలయంను దేశంలోనే అగ్రగామిగా నిలబెట్టేందుకు కృషి చేస్తున్నామని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల రూపు రేఖలు మారుస్తున్నామన్నారు. విద్యా సంవత్సరంను కాపాడాల్సి ఉందని, తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకొని పిల్లల్ని పాఠశాలలకు పంపాలని సూచించారు. పిల్లల హాజరు శాతం పెరుగుతుందని భావిస్తున్నామన్నారు.


ఏపీలోని నాలుగు జిల్లాలో కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోవిడ్ పరీక్షలు పెంచాలని అధికారులకు చెప్పామని, ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేశామని చెప్పారు. అధిక ఫీజులు వసూలును కట్టడి చేస్తూ.. కొత్త ధరలని నిర్ణయిస్తూ జీవో నంబర్లు 53, 54 ఇచ్చామని తెలిపారు. అధికంగా ఫీజులు వసూలు చేస్తే టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయాలని, జాయింట్ కలెక్టర్ల ఆధ్వర్యంలో ఫీజుల నియంత్రణ కమిటీ పనిచేస్తుందని మంత్రి ఆదిమూలపు సురేష్ స్పష్టం చేశారు.

Updated Date - 2021-08-25T21:00:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising