ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా బాధిత కుటుంబానికి మెగా భరోసా

ABN, First Publish Date - 2021-05-09T08:45:48+05:30

కరోనాతో బాధపడుతున్న అభిమాని కుటుంబ సభ్యులతో సినీ హీరో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన కొయిలాడ శ్రీనివాసరావుకు కరోనా సోకింది

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వారితో ఫోన్లో మాట్లాడిన చిరంజీవి


గాజువాక, మే 8: కరోనాతో బాధపడుతున్న  అభిమాని కుటుంబ సభ్యులతో సినీ హీరో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. విశాఖ జిల్లా గాజువాకకు చెందిన కొయిలాడ శ్రీనివాసరావుకు కరోనా సోకింది. అభిమాన సంఘం ద్వారా విషయం తెలుసుకున్న చిరంజీవి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుతో మాట్లాడి సురక్ష ఆస్పత్రిలో  చేర్పించే ఏర్పాటు చేశారు. శ్రీనివాసరావు కుమారుడు రాజుకు శనివారం చిరంజీవి నేరుగా ఫోన్‌ చేసి, ఆమె తల్లి సరస్వతితోనూ వాట్సాప్‌ కాల్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. ఆమెకూ కరోనా సోకినట్టు చెప్పడంతో ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేరాలని సూచించారు. ఇద్దరికీ మెరుగైన వైద్యం అందించేలా చూడాలని చిరంజీవి ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడు స్వామినాయుడుకు చెప్పారు. కాగా, చిరంజీవి నేరుగా మాట్లాడి భరోసా ఇవ్వడం పట్ల ఆ కుటుంబం ఆనందం వ్యక్తం చేసింది. 

Updated Date - 2021-05-09T08:45:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising