ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గిరిజన సంక్షేమంపై శాసనసభ కమిటీ భేటీ

ABN, First Publish Date - 2021-10-30T01:33:26+05:30

రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి తీసుకోవాలసిన చర్యలపై శాసనసభ గిరిజన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమరావతి: రాష్ట్రంలోని గిరిజనుల సంక్షేమానికి తీసుకోవాలసిన చర్యలపై  శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ సమావేశం శుక్రవారం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభ కమిటీ మీటింగ్ హాలులో శాసనసభ గిరిజన సంక్షేమ కమిటీ చైర్మన్ పోలవరం శాసనసభ్యులు శ్రీ తెల్లం బాలరాజు గారి అధ్యక్షతన సమావేశం అయ్యింది. ఈ సమావేశంలో పలు అంశాలపై, గిరిజన సంక్షేమం కోసం తీసుకోవలసిన చర్యలపై చర్చించారు. అదే విధంగా కమిటీ భవిష్యత్ కార్యాచరణపై సమీక్షించారు. 


అలాగే సీఆర్టీల సమస్యపైనా చర్చించారు. ముఖ్యమంత్రి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి, గిరిజన సంక్షేమం మంత్రి దృష్టికి, ఆర్థిక శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. త్వరలోనే ఈ సమస్య పరిష్కరమవుతుదన్నారు. ఈ సమావేశంలో కమిటీ సభ్యులు గోపాలపురం ఎమ్మెల్యే తలారి వెంకట్రావు, రంపచోడవరంఎమ్మెల్యే శ్రీమతి ధనలక్ష్మి , పాడేరు ఎమ్మెల్యే శ్రీమతి భాగ్యలక్ష్మి, రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్, అసెంబ్లీ డిప్యూటీ సెక్రటరీ విజయరాజు, అసెంబ్లీ అసిస్టెంట్ సెక్రటరీ శ్రీనివాస్, అసెంబ్లీ సెక్షన్ అధికారి  రామచంద్రం, తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-10-30T01:33:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising