ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆలకూరపాడులో మావోయిస్టు ఆర్కే సంస్మరణ సభ

ABN, First Publish Date - 2021-10-25T01:58:53+05:30

అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే సంస్మరణ సభ ఆయన భార్య స్వగ్రామమైన ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒంగోలు: అనారోగ్యంతో ఇటీవలే కన్నుమూసిన మావోయిస్టు అగ్రనేత ఆర్కే సంస్మరణ సభ ఆయన భార్య స్వగ్రామమైన ప్రకాశం జిల్లా ఆలకూరపాడులో ఆదివారం నిర్వహించారు. ఉద్యమంలోనే నేలకొరిగిన ఆర్కే కొడుకు పృథ్వీ అలియాస్‌ మున్నా ఐదో వర్ధంతి రోజే ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. గ్రామం మొత్తం బరువెక్కిన హృదయాలతో వారి జ్ఞాపకాలను స్మరించుకుంది. ఆర్కే భార్య, బంధుమిత్రులు, ప్రజా సంఘాల నాయకులు హాజరై ఆయనకు జోహార్లు అర్పించారు. నమ్మిన సిద్ధాంతం కోసం 40 ఏళ్ల విలువైన జీవితాన్ని పోరాటాలకు అంకితం చేసిన ఎర్రసూరీడు ఆర్కే అంటూ కన్నీటి వందనాలు సమర్పించారు. ఉద్యమంలోనే గతంలో అసువుల బాసిన అదే గ్రామానికి చెందిన దత్తాత్రేయ, జయకుమార్‌కు కూడా నివాళులర్పించారు.

Updated Date - 2021-10-25T01:58:53+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising