ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మావోయిస్టు నేత హరిభూషణ్‌ భార్య శారద మృతి

ABN, First Publish Date - 2021-06-27T09:31:05+05:30

మావోయిస్టు పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జెజ్జరి శారదక్క అలియాస్‌ సమ్మక్క (45) మృతి చెందినట్లు ఆ జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ శనివారం తెలిపారు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనాతో ఈ నెల 24న దండకారణ్యంలో కన్నుమూత

భర్త చనిపోయిన మూడు రోజుల వ్యవధిలోనే భార్య


కొత్తగూడెం, గంగారం, చర్ల, జూన్‌ 26: మావోయిస్టు పార్టీ భద్రాద్రి-కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యురాలు జెజ్జరి శారదక్క అలియాస్‌ సమ్మక్క (45) మృతి చెందినట్లు ఆ జిల్లా ఎస్పీ సునీల్‌దత్‌ శనివారం తెలిపారు. కరోనా బారినపడిన శారదక్క ఈ నెల 24న దండకారణ్యంలో చనిపోయినట్లు మహబూబాబాద్‌ జిల్లా పోలీసులు సైతం ప్రకటించారు. శారదక్క.. ఇటీవలమృతి చెందిన మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి యాప నారాయణ అలియాస్‌ హరిభూషణ్‌, అలియాస్‌ జగన్‌ భార్య. కొన్నాళ్ల క్రితం జరిగిన పార్టీ ప్లీనరీకి హాజరైన వీరికి కరోనా సోకినట్లు తెలిసింది. ఈ క్రమంలో మూడు రోజుల క్రితం హరిభూషణ్‌, తాజాగా సమ్మక్క ప్రాణాలు కోల్పోయారు. సమ్మక్క మృతిని మావోయిస్టు పార్టీ ధ్రువీకరించలేదు. అయితే, శుక్రవారం ఛత్తీ్‌సగఢ్‌ రాష్ట్రం మీనగట్టు అటవీ ప్రాంతంలో అంత్యక్రియలు చేసినట్లు సమాచారం. మహబూబాబాద్‌ జిల్లా గంగారంనకు చెందిన ముత్తయ్య-లింగమ్మ దంపతుల మూడో సంతానమైన సమ్మక్క.. ప్రాథమిక విద్య చదువుతుండగానే ప్రజా నాట్యమండలి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంచి గాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్నారు. నక్సల్స్‌కు కొరియర్‌గా వ్యవహరించారు. గంగారం మండలం మడగూడెంకు చెందిన మేన బావ హరిభూషణ్‌ ప్రోత్సాహంతో 1990లో దళంలో చేరారు. పార్టీనే వీరి వివాహం జరిపించింది. 


లొంగిపోయి.. మళ్లీ దళం బాట

సమ్మక్క 2008లో అనారోగ్య కారణాలతో పోలీసులకు లొంగిపోయారు. ఆమెపై ఉన్న రూ.3 లక్షల రివార్డును ప్రభుత్వం తనకే ఇచ్చింది. తర్వాత నాలుగేళ్లు వ్యవసాయం చేసినా.., భర్త చొరవతో మళ్లీ అడవి బాట పట్టారు. 2015లో వెంకటాపురం-చర్ల ఏరియా కమిటీ కార్యదర్శిగా, 2016లో దుమ్ముగూడెం, చింతూరు ఏరియా కమిటీ కార్యదర్శిగా పనిచేశారు. 2019లో తూర్పు గోదావరి జిల్లా, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా డివిజన్‌ కమిటీ సభ్యురాలిగా నియమితులయ్యారు. ప్రస్తుతం సమ్మక్కపై రూ.8 లక్షల రివార్డుంది. కాగా, భద్రాద్రి జిల్లా తుడుందెబ్బ నాయకులు గంగారం గ్రామంలో కొవ్వొత్తులు వెలిగించి హరిభూషణ్‌ దంపతుల మృతికి సంతాపం ప్రకటించారు.

Updated Date - 2021-06-27T09:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising