ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రెక్కల కష్టం.. నేలపాలు

ABN, First Publish Date - 2021-05-06T08:52:14+05:30

ఇది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. రైతులు ఆరుగాలం పండించి తెచ్చిన టమాటాలను కొనేవారు లేక, ఇలా పారబోసి పోయారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇది చిత్తూరు జిల్లా మదనపల్లె మార్కెట్‌. రైతులు ఆరుగాలం పండించి తెచ్చిన టమాటాలను కొనేవారు లేక, ఇలా పారబోసి పోయారు. రెండు రోజులుగా మార్కెట్‌ ఆవరణ ఎర్రటి వ్యర్థాలతో నిండిపోవడంతో అధికారులు బుధవారం ట్రాక్టర్లతో వాటిని బయటికి తరలించారు. చిత్తూరు, అనంతపురం జిల్లాలతోపాటు కర్ణాటక నుంచి రోజూ సగటున 800 టన్నుల టమాటాలు మదనపల్లె మార్కెట్‌కు వస్తున్నాయి. ఇందులో ఏ గ్రేడ్‌ రకం మాత్రమే వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు. అది కూడా 30 కిలోల క్రేటు గరిష్ఠంగా రూ.40-30 పలుకుతోంది. అంటే కిలోకు రూపాయి మాత్రమే ధర లభిస్తోంది. ఇక రెండు, మూడో రకం టమాటాలను కొనేవారే లేరు. ఇక మార్కెటింగ్‌ శాఖ అధికారులు తాము ముందుగా ఎంచుకున్న ఒకటి, రెండు మండలాల నుంచి రోజుకు నాలుగైదు టన్నులు మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. అది కూడా కిలో రూ.2కు మించడం లేదు. పంట అమ్మితే.. కూలి ఖర్చులే కాదు, వాహనం బాడుగకు కూడా సరిపడా డబ్బు రావడంలేదు. దీంతో చాలామంది రైతులు పొలాల్లోనే పశువుల మేతగా పంటను వదిలేస్తున్నారు.

- మదనపల్లె

Updated Date - 2021-05-06T08:52:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising