ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గెజిట్‌తో నష్టమే!

ABN, First Publish Date - 2021-07-18T08:13:47+05:30

వివాదాలు ఉన్న ప్రాజెక్టులతో పాటు వివాదాలు లేనివి.. అనుమతులు లేనివి కూడా కేంద్రం పరిధిలోకి చేర్చడం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కేంద్రం నోటిఫికేషన్‌పై నిపుణుల ఆందోళన

3 ప్రాజెక్టులపైనే తెలుగు రాష్ట్రాల మధ్య వివాదం

కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ పరిధిలో 107 చేరుస్తారా?

రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు నష్టం 

బచావత్‌ ట్రైబ్యునల్‌ హక్కుల్ని తాకట్టు పెట్టడమే

2015 నాటి ఏపీ, తెలంగాణ ఒప్పందం అతిక్రమణ

రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కేంద్రం నియంత్రణలోనికా? 

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతే కారణం 

జీఆర్‌ఎంబీ పరిధిలోకి సీలేరు, మాచ్‌ఖండ్‌లా?

గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం


(అమరావతి-ఆంధ్రజ్యోతి)

వివాదాలు ఉన్న ప్రాజెక్టులతో పాటు వివాదాలు లేనివి.. అనుమతులు లేనివి కూడా కేంద్రం పరిధిలోకి చేర్చడం.. కీలక ప్రాజెక్టులను విస్మరిస్తూ కేంద్ర జలశక్తి శాఖ కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీ గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీ చేయడంపై జల వనరుల నిపుణులు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాలు ఉన్నవి మూడు ప్రాజెక్టులు (శ్రీశైలం, సాగర్‌, పులిచింతల) అయితే.. కృష్ణా, గోదావరి నదులపై మొత్తం 107 ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి చేర్చడాన్ని వ్యతిరేకిస్తున్నారు. వీటిని ఆయా బోర్డుల పరిధిలోకి చేర్చడం రాయలసీమ, ప్రకాశం జిల్లా వాసుల గొంతు కోసేలా ఉందని విమర్శించారు. ఈ గెజిట్‌ను స్వాగతించడమంటే బచావత్‌ ట్రైబ్యునల్‌ ఇచ్చిన హక్కుల్ని తాకట్టుపెట్టడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణా నదీ జలాలపై ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మధ్య వివాదం చెలరేగిన నేపథ్యంలో కేఆర్‌ఎంబీ, జీఆర్‌ఎంబీల పరిధిలోకి మొత్తం ప్రాజెక్టులను చేరుస్తూ కేంద్రం నోటిఫికేషన్‌ జారీ చేయడాన్ని విమర్శించారు. 2015 డిసెంబర్‌ 5న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు చేసుకున్న ఒప్పందాన్ని అతిక్రమించడమేనని నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ ఒప్పందం ప్రకారం కృష్ణా నదిపై ఉమ్మడి ప్రాజెక్టులు మూడు మాత్రమే ఉంటే.. గెజిట్‌లోకి ఏకంగా 107 ప్రాజెక్టులను చేర్చడం ఏమిటని నిలదీశారు. 2016 డ్రాఫ్ట్‌ నోటిఫికేషన్‌లో కేవలం 14 ప్రాజెక్టులకే పరిమితం చేయాలని చెబితే .. ఇప్పుడు 107 ఎలా చేస్తారని నిపుణులు ప్రశ్నించారు.


రాష్ట్ర ప్రాజెక్టులన్నీ కేంద్రం నియంత్రణలోనికి తీసుకోవడం రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతగానే నిపుణులు భావిస్తున్నారు. సీలేరు, మాచ్‌ఖండ్‌లను జీఆర్‌ఎంబీ పరిధిలోకి తీసుకురావడం వల్ల గోదావరి డెల్టా ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే తుంగభద్ర హెచ్‌ఎల్‌సీ, ఎల్‌ఎల్‌సీని కేఆర్‌ఎంబీ పరిధిలోకి ఏ హక్కుతో తెస్తారని నిలదీస్తున్నారు. ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీలను అకారణంగా బోర్డుల పరిధిలోని తీసుకురావడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. బనకచర్ల కింద ఉన్న పెన్నా ప్రాజెక్టును కూడా కేంద్ర బోర్డు పరిధిలోనికి తీసుకురావడం వల్ల రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.


పోలవరాన్ని ఎలా చేరుస్తారు?

రాష్ట్ర విభజన చట్టం ప్రకారం జాతీయ ప్రాజెక్టు హోదా కల్పించిన పోలవరం సాగునీటి ప్రాజెక్టును జీఆర్‌ఎంబీ పరిధిలోకి ఎలా తెస్తారంటూ నిపుణులు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టు కేంద్రం పరిధిలోనే ఉందని గుర్తు చేశారు. కేంద్రం పరిధిలోని ప్రాజెక్టును రాష్ట్రం కార్యనిర్వాహక బాధ్యతలు తీసుకుని నిర్మిస్తోందన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులను కేంద్ర ప్రభుత్వ సంస్థ పోలవరం ప్రాజెక్టు అథారిటీ (పీపీఏ) పర్యవేక్షిస్తున్నందున.. జీఆర్‌ఎంబీ పరిధిలో పనిచేస్తుందా అనే సందేహాలూ వ్యక్తం చేశారు. కాగా ఈ ప్రాజెక్టు నిర్మాణం పనులు మొదలై అనుమతులు వచ్చినందున.. జాతీయ ప్రాజెక్టు అయినప్పటికీ బోర్డు పరిధిలోకి రావచ్చని మరికొందరు వాదిస్తున్నారు. 

Updated Date - 2021-07-18T08:13:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising