ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

శ్రీకాళహస్తిలో రేపటి నుంచి లాక్ డౌన్

ABN, First Publish Date - 2021-04-26T23:53:50+05:30

రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుపతి: రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తి రోజురోజుకు మరింత ఉద్ధృతమవుతోంది. శరవేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ ప్రాణాంతక వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో రాత్రి పూట కర్ఫ్యూ విధించారు. శ్రీకాళహస్తిలో కరోనా తీవ్రత నేపథ్యంలో మంగళవారం నుంచి లాక్‌డౌన్ విధిస్తున్నట్లు శ్రీకాళహస్తి మున్సిపల్ కమిషనర్ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటించారు. అయితే పూర్తి స్థాయిలో లాక్‌డౌన్ కాకుండా కొంత సడలింపులిచ్చారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు మాత్రమే వ్యాపార సముదాయాలకు అనుమతి ఇచ్చారు. ఈ తర్వాత లాక్‌డౌన్ ఆంక్షలు కొనసాగుతాయని శ్రీనివాస్ ప్రకటించారు. 


ఇప్పటికే మధ్యాహ్నం 2 నుంచి మరుసటి రోజు ఉదయం వరకు తిరుపతిలో కర్ఫ్యూ విధించనున్నట్లు ఎమ్మెల్యే కరుణాకర్‌రెడ్డి ప్రకటించారు. తిరుపతి తాతాయగుంట గంగమ్మ జాతర ఏకాంతంగా నిర్వహించాలని ఆలయ బోర్డు సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. అలాగే ఏ ఆలయంలోనూ తీర్థప్రసాదాలు ఇవ్వకూడదని కరుణాకర్‌రెడ్డి స్పష్టం చేశారు. 

Updated Date - 2021-04-26T23:53:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising