ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

టీటీడీలో సంచలనంగా మారిన బెదిరింపు లేఖ

ABN, First Publish Date - 2021-04-08T02:31:57+05:30

టీటీడీలో బెదిరింపు లేఖ సంచలనంగా మారింది. ఎస్వీబీసీ ఎండీ, సీఈవోలకు బెదిరింపు లేఖ వచ్చింది. ఇటీవల పోర్న్ లింక్ ఘటనలో తొలగించిన ఉద్యోగులు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరుమల: టీటీడీలో బెదిరింపు లేఖ సంచలనంగా మారింది. ఎస్వీబీసీ ఎండీ, సీఈవోలకు బెదిరింపు లేఖ వచ్చింది. ఇటీవల పోర్న్ లింక్ ఘటనలో తొలగించిన ఉద్యోగుల నుంచే బెదిరింపు లేఖ వచ్చినట్లు ఎస్వీబీసీ యాజమాన్యం అనుమానం వ్యక్తం చేస్తోంది. బెదిరింపు లేఖపై అలిపిరి పోలీసులకు ఎస్వీబీసీ సీఈవో పిర్యాదు చేశారు. ఐదుగురు ఉద్యోగులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గతేడాది నవంబరులో ఎస్వీబీసీలో ప్రసారమయ్యే శతమానం భవతి కార్యక్రమ వివరాల కోసం మెయిల్‌ పంపిన వెంకటకృష్ణ అనే భక్తుడికి సమాధానంగా చానెల్‌ ఉద్యోగులు పోర్న్‌ లింక్‌ పంపి న సంగతి తెలిసిందే. ఆ భక్తుడి ఫిర్యాదుతో స్పందించిన టీటీడీ అప్పట్లోనే ఆరుగురు ఉద్యోగులను విధుల నుంచి తొలగించింది. ఇటీవల ఎస్వీబీసీలో విధులు నిర్వహిస్తున్న  మరో ముగ్గురు అధికారులను యాజమాన్యం తొలగించింది. ముగ్గురు అధికారులను ఉద్యోగాల నుంచీ తొలగిస్తూ ఎస్వీబీసీ సీఈవో ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ముగ్గురూ ఆఫీసులోనే అశ్లీల వెబ్‌సైట్లు చూసేవారని నివేదికలో పేర్కొన్నారు. 

Updated Date - 2021-04-08T02:31:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising