ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఎస్ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగం గ్రాండ్ సక్సెస్

ABN, First Publish Date - 2021-02-28T16:22:21+05:30

పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇస్రో తొలిసారి చేపట్టిన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నెల్లూరు: పీఎస్‌ఎల్వీ-సీ51 రాకెట్ ప్రయోగం విజయవంతం అయ్యింది. ఇస్రో తొలిసారి చేపట్టిన  ప్రైవేట్ వాణిజ్య ప్రయోగం గ్రాండ్ సక్సెస్ అయ్యింది. మొత్తం  19 ఉపగ్రహాలను అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. ఈ ప్రయోగం నాలుగు దశల్లో సాగింది. ప్రయోగం విజయవంతం కావడం పట్ల ఇస్రో శాస్త్రవేత్తలపై ప్రశంసల వర్షం కురుస్తోంది.


పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శ్రీహరికోటలోని షార్‌ కేంద్రంలో ఉన్న ప్రథమ ప్రయోగ వేదిక నుంచి పీఎస్‌ఎల్వీ-సీ51ని ప్రయోగించారు. శనివారం ఉదయం 8.54 గంటలకు కౌంట్‌డౌన్‌ ప్రారంభంకాగా, ఆదివారం ఉదయం 10.24కు కౌంట్‌డౌన్‌ జీరోకు చేరుకోగానే నింగిలోకి దూసుకు వెళ్లింది. బ్రెజిల్‌కు చెందిన 637 కిలోల అమెజోనియ-1 ఉపగ్రహంతో పాటు, అమెరికాకు చెందిన 13 ఉపగ్రహాలు, ఐదు దేశీయ ఉపగ్రహాలను నిర్దేశిత కక్ష్యలో వదిలిపెట్టారు.

Updated Date - 2021-02-28T16:22:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising