ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వర్షాభావంతో తగ్గనున్న దిగుబడి

ABN, First Publish Date - 2021-10-24T05:15:39+05:30

జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో లోటు వర్షపాతం నమోదైనందున వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ డా.ఎన్‌సీ వెంకటేశ్వర్లు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఆర్‌ఏఆర్‌ఎస్‌ ఏడీఆర్‌ డాక్టర్‌ వెంకటేశ్వర్లు


నంద్యాల టౌన్‌, అక్టోబరు 23: జిల్లాలో ఆగస్టు, సెప్టెంబరు, అక్టోబరు నెలల్లో లోటు వర్షపాతం నమోదైనందున వేరుశనగ, పత్తి, మొక్కజొన్న పంటల దిగుబడి గణనీయంగా తగ్గే అవకాశం ఉందని నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్‌ డా.ఎన్‌సీ వెంకటేశ్వర్లు అన్నారు. ఆర్‌ఏఆర్‌ఎస్‌లో శిక్షణ, సందర్శన సమావేశాన్ని శనివారం నిర్వహించారు. జిల్లా వ్యవసాయశాఖ జేడీ పీఎస్‌ వరలక్ష్మి, ఆత్మ పీడీ ఉమామహేశ్వరమ్మ, డీడీఏ బోస్‌బాబు, వ్యవసాయశాఖ అధికారులు, శాస్త్రవేత్తలతో ఆయన సమీక్ష నిర్వహించారు. జిల్లాలోని పంటల పరిస్థితులను, వివిధ సమస్యలను ఈ సమావేశంలో చర్చించామని ఏడీఆర్‌ తెలిపారు. సబ్‌ డివిజన్లలో సహాయ సంచాలకులకు వారి వారి పరిధిలో పంటల పరిస్థితులను వివరించారు. శనగ, జొన్న పంటల శాస్త్రవేత్తలు అధికదిగుబడి పొందడానికి మెలకువలను తెలిపారు. వివిధ పంటల్లో ప్రస్తుతం ఉన్న తెగుళ్లు, పురుగుల యాజమాన్యం గురించి చర్చించారు. కార్యక్రమంలో కీటక విభాగం శాస్త్రవేత్త డా.జె రవీంద్రనాథ్‌, వివిధ పంటల శాస్త్రవేత్తలు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-24T05:15:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising