ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అరాచకాలతోనే వైసీపీ గెలుపు: గౌరు

ABN, First Publish Date - 2021-09-29T04:51:52+05:30

స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు అరాచకాలతో గెలుపొందారని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి అన్నారు.

తూడిచర్లలో మాట్లాడుతున్న గౌరు వెంకటరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జూపాడుబంగ్లా,  సెప్టెంబరు 28: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నాయకులు అరాచకాలతో గెలుపొందారని టీడీపీ నంద్యాల లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షులు గౌరు వెంకటరెడ్డి అన్నారు. తూడిచర్ల గ్రామంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు. రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటూ రైతులను జగన మోసం చేస్తున్నారని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినా, 5 ఎకరాలలోపు పొలాల్లో వచ్చిన దిగుబడిని మాత్రమే కొనుగోలు చేశారని అన్నారు.  మొత్తం విత్తనాలను కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ఘోరంగా విఫలమయ్యారని అన్నారు. రైతు భరోసా కేంద్రాల్లో  బినామీపేర్లతో వైసీపీ నాయకులు ఎరువులు, వ్యవసాయ పనిముట్లు అమ్ముకుంటున్నారని ఆరోపించారు.  ఎరువులపై సబ్సిడీ ఎత్తేసి విపరీతంగా ధరలు పెంచారని అన్నారు. పెట్రోల్‌, డీజల్‌ ధరలు భారీగా పెంచారని అన్నారు. సర్పంచులకు చెక్‌ పవర్‌ ఇవ్వకుండా ప్రభుత్వం నిధులన్నీ  మళ్లించిందని ఆరోపించారు. సర్పంచులు సొంత డబ్బులను గ్రామ పంచాయతీకి ఖర్చుపెట్టి ప్రజల సమస్యలను పరిష్కరిస్తున్నారని అన్నారు. నవరత్నాల పేరుతో ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోందని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో జగన ప్రభుత్వం విఫలం అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు గిరీశ్వరరెడ్డి, వెంకటేశ్వర్ల యాదవ్‌, రాముడు, శేఖర్‌రెడ్డి, రామోహ్మన రెడ్డి, రవికుమార్‌యాదవ్‌, శ్రీనివాసులు, సురే్‌షయాదవ్‌, వేణుగోపాల్‌, కడియం పుల్లన్నయాదవ్‌, పలుచాని మహేశ్వరరెడ్డి పాల్గొన్నారు.


Updated Date - 2021-09-29T04:51:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising