భద్రత కల్పించడంలో వైసీపీ విఫలం: బీజేపీ
ABN, First Publish Date - 2021-01-03T05:39:03+05:30
రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, విగ్రహాలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు.
కర్నూలు(ఎడ్యుకేషన్), జనవరి 2: రాష్ట్రంలో హిందూ దేవాలయాలు, విగ్రహాలకు భద్రత కల్పించడంలో వైసీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని బీజేపీ నాయకులు ఆరోపించారు. జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామస్వామి మాట్లాడుతూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు హిందూ ధర్మానికి ప్రమాద ఘంటికలుగా మారాయన్నారు. విజయనగరం జిల్లా రామతీర్థంలోని కోదండ రామస్వామి విగ్రహం తలను వేరు చేయడం, రాజమండ్రిలో వినాయకస్వామి గుడిలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహాన్ని ధ్వంసం చేయడం చూస్తుంటే.. ఇది అర్థమవుతోందన్నారు. ప్రభుత్వం హిందూ దేవాలయాలపై పరోక్షంగా దాడులకు పాల్పడుతున్నదని ఆరోపించారు. దాడులకు బాధ్యతాయు తంగా స్పందించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో బీజేపీ కార్యవర్గ సభ్యులు కె.హరీష్‌బాబు, వినీషారెడ్డి, నాయకులు కె.చెన్నయ్య, రామక్రిష్ణ, కాశీవిశ్వనాథ్, జి.నాగేంద్ర, వేముల శ్రీధర్, సింగవరం అరుణ్, పీజీఆర్ గణేష్, సాయిచరణ్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-03T05:39:03+05:30 IST