టీడీపీలోకి వైసీపీ కార్యకర్తలు
ABN, First Publish Date - 2021-10-22T05:24:36+05:30
కర్నూలు మండలం జీ.శింగవరం, ఉల్చాల గ్రామానికి చెందిన 20మంది వైసీపీ కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు.
కర్నూలు(రూరల్), అక్టోబర్ 21: కర్నూలు మండలం జీ.శింగవరం, ఉల్చాల గ్రామానికి చెందిన 20మంది వైసీపీ కార్యకర్తలు గురువారం టీడీపీలో చేరారు. ఈ మేరకు కర్నూలులోని కోట్ల నివాసంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటేష్‌నాయుడు నేతృత్వంలో కోడుమూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ వారికి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేరిన వారిలో వెంకటేష్, ఎల్లనాయుడు, శివ, మధు, పాపాన్న, భరత్‌పాటు మరో 14మంది యువకులు ఉన్నారు.
కర్నూలు(రూరల్): రాష్ట్ర ప్రభుత్వం పెంచిన విద్యుత్ చార్జీలను వెంటనే తగ్గించాలని కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి ఆకెపోగు ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు కోట్ల కార్యలయంలో గురువారం కర్నూలు రూరల్ మండలం టీడీపీ సర్వసభ్య సమావేశం కన్వీనర్ వెంకటేష్ నాయుడు అధ్యక్షతన నిర్వహించారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు సత్రం రామకృష్ణుడు, పేరపోగు రాజు, శివశంకర్, నాగరాజు, సయ్యద్, చెన్నకేశవులు మునిస్వామి, మగ్బుల్ భాష, సత్యప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-22T05:24:36+05:30 IST