ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్రంలో ఆటవిక పాలన

ABN, First Publish Date - 2021-10-21T05:16:03+05:30

రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన స్వగ్రామం లద్దగిరి నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు.

కోట్లను గృహ నిర్బంధం చేసిన పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

   కోట్ల సూర్యప్రకాశ రెడ్డి ధ్వజం

కోడుమూరు(రూరల్‌), అక్టోబరు 20: రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయసూర్యప్రకాశరెడ్డి ధ్వజమెత్తారు. ఆయన స్వగ్రామం లద్దగిరి నివాసంలో పోలీసులు హౌస్‌ అరెస్ట్‌ చేశారు. గ్రామం దాటి వెళ్లకుండా ఆంక్షలు విధించారు. పోలీసుల చర్యలపై కోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. వైసీపీ చేతిలో పోలీసు వ్యవస్థ కీలుబొమ్మగా మారిందన్నారు. వైసీపీ గుండాలు దాడులు, ఆస్తుల ధ్వంసం, హత్యలు చేస్తోంటే చూస్తూ ఊరుకోవాలా? అని ప్రశ్నించారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు అసభ్య పదజాలంతో మాట్లాడుతోంటే కేసులు పెట్టారా? అని నిలదీశారు. నాడు చంద్రబాబు నాయుడును నడిరోడ్డులో కాల్చా లంటూ జగన తీవ్ర వ్యాఖ్యలు చేశారని, అయితే ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గుర్తు చేశారు. పోలీసులను అడ్డుపెట్టుకుని టీడీపీ నాయకులపై దాడులకు ప్రోత్సహిస్తే సహించేదిలేదని తీవ్రంగా హెచ్చరించారు. రాజన్న రాజ్యం అంటూ చెప్పుకునే జగన రాజశేఖర్‌రెడ్డి కాంగ్రెస్‌ ముఖ్యమంత్రి అని మరచిపోవద్దన్నారు. అరాచకాలతో కాకుండా అభివృద్ధితో సొంత ఇమేజ్‌ను పెంచుకోవాలని సూచించారు. ఇలాంటి ప్రభుత్వాన్ని తన రాజకీయ జీవితంలో ఎన్నడూ చూడలేదని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు ఎన్ని కేసులు పెట్టినా భయపడమని, ప్రజలకు అండగా ఉంటూ పోరాడుతామని తేల్చి చెప్పారు. 


Updated Date - 2021-10-21T05:16:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising