ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అడిగేదెవరు..?

ABN, First Publish Date - 2021-10-27T05:33:04+05:30

గ్రామీణ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గ్రామీణ ప్రాంతాలకు సరైన రవాణా సౌకర్యాలు లేవు. దీంతో ప్రజలు ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. గుంతలు పడిన దారుల్లో ట్రాలీ ఆటోల్లో వెళుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. హొళగుంద మండలంలో వ్యవసాయ పనులకు ఇతర ప్రాంతాల నుంచి కూలీలు ఇలా ప్రమాదకర ప్రయాణం చేస్తున్నారు. పరిమితికి మించి  వాహనాల్లో కుక్కుతున్నారు. ప్రమాదమని తెలిసినా, గత్యంతరం లేదని కూలీలు అంటున్నారు. ఒక్కో ఆటోలో 60 నుంచి వంద మంది వరకూ ప్రయాణిస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. హొళగుంద నుంచి ఆదోని వైపు నిత్యం పదుల సంఖ్యలో ఆటోలు ఇలా కిక్కిరిసి వస్తుంటాయి. ఆటోల పైభాగాన 15 ఏళ్లలోపు పిల్లలను వ్యవసాయ పనులకు తరలిస్తున్నారు. ప్రమాదాలు జరగక ముందే అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. 

- ఆదోని 




Updated Date - 2021-10-27T05:33:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising