ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

స్టోరేజీ ఫుల్‌, సరఫరా నిల్‌

ABN, First Publish Date - 2021-04-18T05:14:03+05:30

మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో రూ.1.18 కోట్లతో నిర్మించిన ఎస్‌ఎస్‌ ట్యాంకు నిరుపయోగంగా ఉంది.

మల్లేవేములలో ఎస్‌ఎస్‌ ట్యాంకు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 7 గ్రామాలకు  నిలిచిన నీటి సరఫరా


చాగలమర్రి, ఏప్రిల్‌ 17: మండలంలోని మల్లేవేముల గ్రామ సమీపంలో రూ.1.18 కోట్లతో నిర్మించిన ఎస్‌ఎస్‌ ట్యాంకు నిరుపయోగంగా ఉంది. ఈ ట్యాంకు ద్వారా 7 గ్రా మాలకు ఫ్లోరైడ్‌ రహిత నీరు అందించేందుకు దివంగత ఎమ్మెల్యే శోభా నాగిరెడ్డి హయాంలో   చర్యలు తీసుకున్నారు. ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి 7 గ్రామాలకు పైపులైన్‌, ఓవర్‌హెడ్‌ ట్యాంకులు ఏర్పాటు చేశారు.   ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా నీరు   సరఫరా  చేస్తున్నారు. అయితే గత రెండేళ్ల నుంచి ఆయా గ్రామాలకు ఎస్‌ఎస్‌ ట్యాంకు నుంచి ఆయా గ్రామాలకు నీటి సరఫరా నిలిపి వేశారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఎస్‌ఎ్‌స ట్యాంకుకు కేసీ కెనాల్‌ నుంచి నీటిని పంపింగ్‌ చేస్తున్నారు. గత ఏడాది అదనంగా రెండు బోర్లను ఏర్పాటు చేసి ఆ నీటిని ఫిల్టర్‌ చేసి చాగలమర్రికి నీటి సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు. ప్రస్తుతం ఎస్‌ఎ్‌స ట్యాంకులో నీరు నిండుగా ఉన్న ఆ నీటిని సరఫరా చేయకుండా నిలిపి వేశారు.  అధికారులు స్పందించి ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా ఫ్లోరైడ్‌ రహిత నీటిని అందించాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. ఈ విషయం గురించి ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ శివకుమార్‌ను వివరణ కోరగా ఎస్‌ఎస్‌ ట్యాంకు ద్వారా గ్రామాలకు నీటి సరఫరా జరగడం లేదని అన్నారు. కేసీ ప్రధాన కాలువ నుంచి ఎస్‌ఎ్‌స ట్యాంకుకు నీరు నింపుతున్నామని అన్నారు. కొత్తగా వేసిన రెండు బోర్ల ద్వారా నీటిని ట్యాంకుకు పంపింగ్‌ చేస్తున్నామని అన్నారు. వేసవిలో నీటి సమస్య తలెత్తితే ట్యాంకు ద్వారా నీటి సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. క్లోరైడ్‌ రహిత నీటిని అందించేందుకు సిద్ధం చేశామని అన్నారు.

Updated Date - 2021-04-18T05:14:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising