విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ దారుణం: సోమిశెట్టి
ABN, First Publish Date - 2021-10-30T04:35:46+05:30
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు సిద్ధం కావడం దారుణమని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.
కర్నూలు(అగ్రికల్చర్), అక్టోబరు 29: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటీకరించేందుకు సిద్ధం కావడం దారుణమని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. శుక్రవారం కర్నూలు నగరంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ సభ్యులు శకునాల చంద్రశేఖర్, వినయ్ చంద్ర సోమిశెట్టిని కలిసి తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. సోమిశెట్టి మాట్లాడుతూ ఈ ఉక్కు పరిశ్రమను కాపాడుకునేందుకు ప్రతి ఒక్కరూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచే విధంగా ఉద్యమాన్ని తీవ్రం చేయాలని, ఇందులో భాగంగా తెలుగుదేశం పార్టీ ప్రత్యక్షంగా విశాఖ ఉక్కు కోసం కార్యాచరణ ప్రణాళికతో ఉద్యమాలకు సిద్ధమైందని సోమిశెట్టి స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసుకునేందుకు ఉమ్మడి రాష్ట్రంలో ప్రజలు ఎన్నో దశాబ్దాల తరబడి మరెన్నో పోరాటాలు చేశారని, ఈ ఉద్యమంలో వందల మంది ప్రాణత్యాగాలు చేశారని గుర్తు చేశారు. పార్టీ బీసీ సెల్ అధ్యక్షుడు సత్రం రామక్రిష్ణుడు పాల్గొన్నారు.
Updated Date - 2021-10-30T04:35:46+05:30 IST