ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి అప్పలరాజు క్షమాపణ చెప్పాలి

ABN, First Publish Date - 2021-12-03T05:49:45+05:30

వీఆర్వోల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు తన మాటలను వెనక్కు తీసుకుని వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని మండల వీఆర్వోల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు.

వెల్దుర్తిలో నిరసన తెలుపుతున్న వీఆర్వోలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వెల్దుర్తి, డిసెంబరు 2: వీఆర్వోల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అప్పలరాజు తన మాటలను వెనక్కు తీసుకుని వీఆర్వోలకు క్షమాపణ చెప్పాలని మండల వీఆర్వోల సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం నల్లబ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. వీఆర్వోలు మాట్లాడుతూ మంత్రి సమావేశానికి వీఆర్వోలను పిలిచి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు వీఆర్వోలను తరిమికొట్టండి అని అనడం చాలా బాధాకరమన్నారు. నిరసన కార్యక్రమంలో వీఆర్వోలు రామకృష్ణారెడ్డి, రమణారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మద్దిలేటిస్వామి, కేకే మద్దిలేటి, ఆనంద్‌, సతీష్‌, రవితేజ, మహేష్‌, బోగోలు శంకర్‌ తదితరులు ఉన్నారు. 


తుగ్గలి: వీఆర్వోలు ఎంతో బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తిస్తూ ఉంటే చులకన భావనతో చూడడం ఎంతవరకు సమంజసమని వీఆర్వోల సంఘం మండల అధ్యక్షుడు వెంకటరాముడు ప్రశ్నించారు. తుగ్గలి తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట గురువారం ధర్నా చేపట్టారు. వెంకటరాముడు మాట్లాడుతూ తకు కేటాయించిన విధులు నిర్వర్తించడంతో పాటు ప్రభుత్వం కొత్త విధులను ఇస్తున్నా చేస్తున్నామని, అలాంటిది వీఆర్వోలపై చులకన భావనంతో  మాట్లాడటం, వీఆర్వోలు అక్కర్లేదు అనడం ఎంతవరకు సమంజ సమని ప్రశ్నించారు. గ్రామస్థాయిలో వీఆర్వోలు ఎంతో ఇబ్బందులతో కూడిన విధులు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీఆర్వోలపై ఒత్తిడి పెంచితే ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వీఆర్వోలు రాజునాయక్‌, లక్ష్మి, రేష్మ, వీఆర్‌ఏలు రామాంజనేయులు, శేఖర్‌, నెట్టి తదితరులు పాల్గొన్నారు.





Updated Date - 2021-12-03T05:49:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising