ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నీరు లేని ఊరు

ABN, First Publish Date - 2021-02-27T05:42:29+05:30

ఎక్కడైనా వేసవిలో తాగునీటి సమస్య ఉంటుంది. కానీ ఆ ఊరిలో మాత్రం ఏడాది పొడవునా తాగునీటికి కటకటనే..! రుద్రవరం మండలంలోని చిలుకలూరు ప్రజల కష్టం

బిందెలతో నీరు తీసుకెళుతున్న గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. అర కి.మీ. వెళ్లి తెచ్చుకుంటారు
  2. చిలుకలూరు ప్రజల ఇబ్బందులు


రుద్రవరం, ఫిబ్రవరి 26: ఎక్కడైనా వేసవిలో తాగునీటి సమస్య ఉంటుంది. కానీ ఆ ఊరిలో మాత్రం ఏడాది పొడవునా తాగునీటికి కటకటనే..! రుద్రవరం మండలంలోని చిలుకలూరు ప్రజల కష్టం ఇది. గ్రామానికి సుమారు అర కిలో మీటరు దూరంలో ఉన్న పెద్దమ్మ గుడి వద్దకు వెళ్లి అక్కడున్న చేతి పంపు నుంచి తాగునీటిని తెచ్చుకుంటారు. గ్రామంలో కొన్నేళ్ల క్రితం ఏర్పాటు చేసిన ఓ చేతిపంపు ఉంది. అందులో ఉప్పునీరు వస్తుంది. గతంలో ఓ వాటర్‌ ప్లాంట్‌ ఉండేది. స్థానిక రాజకీయాల కారణంగా దాన్ని మూసేశారు. 

చిలుకలూరులో సుమారు 350 కుటుంబాలు ఉంటున్నాయి. అందరికీ పెద్దమ్మ గుడి చేతిపంపే దిక్కు. బైకు, సైకిలు మీదనో, కాలినడకనో బిందెలు తీసుకువెళ్లి నీటిని తెచ్చుకుం టున్నారు. ఎమ్మెల్యే గంగుల బిజేంద్రా రెడ్డి స్వగ్రామం ఎర్రగుడిదిన్నెకు సుమారు ఒకటిన్నర కిలో మీటరు దూరంలో ఉంటుంది ఈ పల్లె. తాగునీటి సమస్యను పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.


అర కి.మీ. వెళ్లాలి.. 

అర కి.మీ. వెళ్లి తాగునీటిని తెచ్చు కుంటున్నాం. ఏళ్లు గడిచినా సమస్య పరిష్కారం కావడం లేదు. మహిళలు అంత దూరం నుంచి మోయలేక ఇబ్బంది పడుతున్నారు. అధికారులు తాగు  నీటి సమస్యను పరిష్కరించాలి. - ఉసేన్‌ బాషా


అధికారులకు తెలిపినా..

తాగునీటి కోసం ఇంకా ఎన్ని రోజులు ఇబ్బం దులు పడాలో తెలియ డం లేదు. వర్షాకా లంలో బిందెలను అంతదూరం నుంచి మోయలేక యాతన పడుతున్నాం. అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. - వన్నూరు


Updated Date - 2021-02-27T05:42:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising