ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవతలారా.. రారండి!

ABN, First Publish Date - 2021-03-05T06:57:25+05:30

దేవతలారా.. రారండి!

ధ్వజ పటాన్ని ఆవిష్కరిస్తున్న ఈవో కేఎస్‌ రామరావు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఆహ్వానం పలుకుతూ ధ్వజపటం ఆవిష్కరణ
  2. శ్రీశైలంలో మొదలైన శివరాత్రి బ్రహ్మోత్సవాలు


శ్రీశైలం, మార్చి 4: శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు గురు వారం ప్రారంభం అయ్యాయి. ఉదయం 9:45 గంటలకు యాగశాల ప్రవేశంతో ఉత్స వాలు మొదలయ్యాయి. అనం తరం దేశం శాంతి సౌభాగ్యాలతో విరిసి ల్లాలని అర్చకులు, వేద పండితులు లోక కళ్యాణ సంకల్పాన్ని పఠించారు. దీన్నే శివసం కల్పం అంటారు. తర్వాత ఉత్స వాలు నిర్విఘ్నంగా సాగాలని మహా గణపతి పూజ చేశారు. చండీశ్వరుడికి కూడా పూజలు చేశారు. బ్రహ్మోత్స వాలకు సకల దేవతలను ఆహ్వానిస్తూ సాయంత్రం ప్రధాన ధ్వజస్తంభం మీద పతాకాన్ని ఆవిష్కరించారు. 


నేడు భృంగివాహన సేవ

బ్రహ్మోత్సవాల రెండో రోజు నుంచి వాహనసేవలు మొదలవుతాయి. శుక్ర వారం భమరాంబ మల్లికార్జున స్వామి వార్లకు భృంగివాహన సేవ నిర్వహిస్తారు. కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ గ్రామోత్సవం జరుపుతారు. 


సంప్రదాయాన్ని అనుసరించి..

మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు క్షేత్ర సంప్రదాయాన్ని అనుసరించి జరుగు తాయి. 11 రోజులపాటు వాహనసేవలు, గ్రామోత్సవం నిర్వహిస్తారు. పాగాలం కరణ, లింగోద్భవకాల మహన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, కల్యాణోత్సవం, రథోత్సవం, తెప్పోత్సవం, వాహన సేవలు ప్రధాన ఘట్టాలు. - పూర్ణానంద ఆరాధ్యులు, దేవస్థానం స్థానాచార్యులు


భక్తులకు అన్ని సౌకర్యాలు: ఈవో

బ్రహ్మోత్సవాల సందర్భంగా 14 వరకు అర్జిత సేవలను నిలుపుదల చేస్తున్నట్లు ఈవో కేఎస్‌ రామరావు తెలిపారు. భక్తులకు ఇబ్బంది లేకుండా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. భక్తులు కొవిడ్‌ నిబంధనలను పాటించేలా చర్యలు తీసుకున్నట్లు తెలియజేశారు.

Updated Date - 2021-03-05T06:57:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising