ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉగాది వేళ కర్షకోత్సాహం

ABN, First Publish Date - 2021-04-13T05:05:19+05:30

ఉగాది ప్రకృతి పండుగ. సేద్యపు వేడుక. రుతువులతో ముడిపడన ఉగాది వేళ పంటలు సాగు చేసే రైతుల సంబరం అంతా ఇంత కాదు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. నేటి నుంచి చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవం 
  2. ఎడ్లబండ్లు, గాడిదల ప్రదర్శన 


కల్లూరు, ఏప్రిల్‌ 12: ఉగాది ప్రకృతి పండుగ. సేద్యపు వేడుక. రుతువులతో ముడిపడన ఉగాది వేళ పంటలు సాగు చేసే రైతుల సంబరం అంతా ఇంత కాదు. తెలుగువారి ఉగాది చుట్టూ పశువులతో, పంటలతో వేడుకలు ఉంటాయి. జిల్లాలో ఉగాది పండుగకు ప్రత్యేకంగా సంబరాలు చేసుకుంటారు. కల్లూరులో జరిగే చౌడేశ్వరిదేవి జ్యోతి మహోత్సవాలు చాలా ప్రత్యేకమైనవి. 1890లలో కల్లూరు గ్రామంలోని తొగటవీరులు ఎద్దుల బండ్లపై తాము తయారు చేసిన వస్త్ర ఉత్పత్తులను డిసెంబరు, జనవరి మాసాల్లో చెన్నై మహానగరంలో విక్రయించేందుకు వెళ్లే వారట. వారు తిరిగి వచ్చేటప్పుడు కలరా సోకి చాలా మంది చనిపోయారట. ఇలా ఎద్దులబండ్లపై దూర ప్రాంతాలకు వెళ్లిన వారు క్షేమంగా ఇంటికి చేరాలని తొగటవీరులు కల్లూరులోని చౌడేశ్వరి ఆలయం చుట్టూ ఎద్దుల బండ్లతో ప్రదర్శనలు చేసి అమ్మవారికి మొక్కులు తీర్చుకునే వారని చెబుతారు. అప్పటి నుంచి ఉగాది వేళ చౌడేశ్వరి జ్యోతి ఉత్సవాలు ప్రత్యేకతను సంతరించుకున్నాయి. 13 నుంచి 15వ తేదీ వరకు ఈ ఉత్సవాలు జరుగుతాయి. 


నారుమడి పద్ధతిలో ఎడ్లబండ్ల ప్రదర్శన

ఉగాది వేడుకల్లో భాగంగా అమ్మవారి ఆలయం చుట్టూ నారుమడి పద్ధతుల్లో నీరు నింపుతారు. ఎద్దులను అలంకరించి గ్రామ ఊరువాకిలి నుంచి మేళతాళాలతో ఊరేగిస్తూ అమ్మవారి ఆలయం చుట్టూ రైతులు తిప్పుతారు. ఎద్దుల బండ్లతోపాటు గాడిదలను ఆలయ ప్రదక్షిణ చేయిస్తారు. 

Updated Date - 2021-04-13T05:05:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising