ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరి మృతి

ABN, First Publish Date - 2021-12-04T04:33:40+05:30

జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. అవుకు పట్టణానికి చెందిన కైప సూర్యప్రసాద్‌ (47) అనే వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


అవుకు, డిసెంబరు 3: జిల్లాలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. అవుకు పట్టణానికి చెందిన కైప సూర్యప్రసాద్‌ (47) అనే వ్యక్తి శుక్రవారం రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు ఎస్‌ఐ జగదీశ్వర్‌రెడ్డి శుక్రవారం తెలిపారు. సూర్యప్రసాద్‌ మరో వ్యక్తి కలిసి అవుకు నుంచి బనగానపల్లెకు మోటర్‌ సైకిల్‌పై వెళుతుండగా కోనాపురం మెట్ట సమీపంలోని బ్రిడ్జి అదుపుతప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడ్డ సూర్యప్రసాద్‌ను చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య జమయ్మ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెల్లడించారు. సూర్యప్రసాద్‌ మృతి పట్ల మాదిగ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షుడు సాత్రి చిన్నఈశ్వరయ్య కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

రెండు బైకులు ఢీ

ఆత్మకూరురూరల్‌: మండల పరిధిలోని శ్రీపతిరావు పేట గ్రామ శివార్లలో కేజి రోడ్డు పై ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఢీ కొన్నాయి. ఈ  ఈ ప్రమాదంలో సిద్ధాపురం గ్రామానికి చెందిన అశోక్‌ అనే యువకుడు మృతి చెందగా పాములపాడు మండలం ఇస్కాల గ్రామానికి చెందిన చాంద్‌ బాషాలకు తీవ్ర గాయాల య్యాయి. సిద్ధాపురం గ్రామానికి చెందిన అశోక్‌, ప్రతాప్‌ ఆత్మకూరులో పనులు ముగిం చుకొని శుక్రవారం రాత్రి స్వగ్రామానికి బయలు దేరారు. కాగా వెంకటాపురం గ్రామం నుంచి ఇస్కాల గ్రామానికి చెందిన చాంద్‌ బాషా మరో బైక్‌లో పాములపాడుకు వెళ్తుండగా శ్రీపతిరావు పేట గ్రామ శివార్లలో కర్నూలు గుంటూరు రహదారిలో రెండు బైకులు ఢీకొన్నాయి. ఈ  రోడ్డు ప్రమాదంలో అశోక్‌ అక్కడికక్కడే మృతి చెందగా , చాంద్‌బాషాకు తీవ్రగాయాలు కావడంతో చికిత్స నిమిత్తం కర్నూలుకు తరలించినట్లు ఎస్‌ఐ  హరిప్రసాద్‌  వెల్లడించారు. 


Updated Date - 2021-12-04T04:33:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising