ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

250 మందికి కొవిడ్‌ టీకా

ABN, First Publish Date - 2021-05-12T05:39:21+05:30

మండలంలోని ఆలమూరు గ్రామంలో మంగళవారం 250 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యాధికారి వినయ్‌ తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రుద్రవరం, మే 11: మండలంలోని ఆలమూరు గ్రామంలో మంగళవారం 250 మందికి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేసినట్లు వైద్యాధికారి వినయ్‌ తెలిపారు. కొవిడ్‌ వ్యాక్సిన్‌ రెండో డోస్‌ వేశామని అన్నారు. ఈ సందర్భంగా వైద్యాధికారి మాట్లాడుతూ మాస్క్‌ తప్పనిసరిగా ధరిస్తూ భౌతికదూరం పాటించాలని అన్నారు. శానిటైజర్‌ వాడటంతో పాటు చేతులు శుభ్రం చేసుకోవాలని సూచించారు. కోవిడ్‌ నిబంధనలు పాటించాలని ప్రజలకు సూచించారు.  ఈ కార్యక్రమంలో ఏఎన్‌ఎంలు సుహాసిని, అరుణకుమారి, సూపర్‌వైజర్లు, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.  


శిరివెళ్ల: మండలంలోని 91 మందికి మంగళవారం కొవిడ్‌ రెండో డోస్‌ టీకా వేసినట్లు శిరివెళ్ల వైద్యాధికారి విజయ్‌ కుమార్‌ తెలిపారు. గ్రామంలోని ఉర్దూ పాఠశాలలో ప్రభుత్వ నిబంధనలు పాటిస్తూ ప్రజలకు వ్యాక్సిన్‌ వేశారు. శిరివెళ్ల ఎస్‌ఐ సూర్యమౌళి వ్యాక్సినేషన్‌ కేంద్రాన్ని పరిశీలించి ప్రజలకు సూచనలిచ్చారు. కమ్యూనిటీ హెల్త్‌ ఆఫీసర్‌ రామ్మోహన్‌రెడ్డి, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. 


చాగలమర్రి: మండలంలో 4 వేల మందికి కరోనా టీకా వేశామని వైద్యుడు గంగాధర్‌ తెలిపారు. మంగళవారం ప్రభుత్వ వైద్యశాలలో రెండో విడత కరోనా టీకా వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మొదటి విడత 3,733 మందికి, రెండో విడత 270 మందికి టీకా వేశామని తెలిపారు.  


Updated Date - 2021-05-12T05:39:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising