ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈతకెళ్లిన ఇద్దరు బాలుర మృతి

ABN, First Publish Date - 2021-06-16T05:30:00+05:30

ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామంలో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు.

మృతి చెందిన తరుణ్‌, శివానందరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు, జూన్‌ 16: ఉలిందకొండ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కల్లూరు మండలం యాపర్లపాడు గ్రామంలో ఈతకెళ్లి ఇద్దరు బాలురు మృతి చెందారు. గ్రామానికి చెందిన శివానందరెడ్డి (16), తరుణ్‌ (13) నీటికుంటలో మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు శివానందరెడ్డి, తరుణ్‌ తోటి మిత్రులతో కలిసి బుధవారం సాయంత్రం ఊరి సమీపంలో ఉన్న బావికి ఈతకు వెళ్లారు. నడుముకు బుడగ బెల్టులు కట్టుకుని బావిలోకి దూకారు. కొద్ది సేపటి తర్వాత తరుణ్‌ బుడగ బెండు ఊడిపోయింది. నీటిలో మునిగి పోతుండగా శివానందరెడ్డి కాపాడే యత్నంలో ఈ బాలుడి బుడగబెండు కూడా ఉడిపోయింది. ఇద్దరూ నీటిలో మునిగిపోయారు. సమీపంలో ఉన్న తోటి మిత్రులు కాపాడేప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. కర్నూలు డీఎస్పీ మహేష్‌, ఉలిందకొండ ఎస్‌ఐ శరత్‌ కుమార్‌ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. పైరింజన్లను తెప్పించి అగ్నిమాపక శాఖ సిబ్బంది సాయంతో ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు. ఒకే రోజు ఇద్దరు పిల్లలు చనిపోవడంతో గ్రామంలో విషాదచాయలు అలుముకున్నాయి. శివానందరెడ్డి తండ్రి మద్దిలేటి రెడ్డి వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు ఇద్దరు కొడుకులు. తరుణ్‌ తండ్రి వెంకటేశ్వర్లు కూడా వ్యవసాయం చేస్తుంటాడు. ఈయనకు ఇద్దరు కొడుకులే. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమ్మితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. 

Updated Date - 2021-06-16T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising