రేపటి నుంచి జిల్లాలో వర్ష సూచన
ABN, First Publish Date - 2021-05-05T04:56:25+05:30
జిల్లాలో గురువారం నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని బనవాసి కృషివిజ్ఞానకేంద్రం వ్యవసాయ, వాతావరణ విభాగం శాస్త్రవేత్త మహాదేవయ్య తెలిపారు
ఎమ్మిగనూరు టౌన్, మే 4: జిల్లాలో గురువారం నుంచి వర్షాలు పడే సూచనలు ఉన్నాయని బనవాసి కృషివిజ్ఞానకేంద్రం వ్యవసాయ, వాతావరణ విభాగం శాస్త్రవేత్త మహాదేవయ్య తెలిపారు. ఈనెల 6వ తేదీన ఆలూరు, సి.బెళగల్, చిప్పగిరి, డోన్, గోనెగండ్ల, గూడురు, హాలహర్వి, కోడుమూరు, కృష్ణగిరి, మద్దికెర, మంత్రాలయం, నందవరం, తుగ్గలి, వెల్దుర్తి, హొళగుంద, శ్రీశైలం మండలాల్లో వర్షం పడే సూచనలు ఉన్నాయని ఆయన తెలిపారు. 7వ తేదీన బేతంచర్ల, కృష్ణగిరి, మద్దికెర, మిడ్తురు, నందికొట్కూరు, ప్యాపిలి, తుగ్గలి, వెల్దుర్తి, ఆదోని, ఆలూరు, ఆస్పరి, సి.బెళగల్, దేవనకొండ, గోనెగండ్ల, చిప్పగిరి, గూడురు, హాలహర్వి, హొళగుంద, కల్లూరు, కోడుమూరు, కోసిగి, కౌతాళం, కర్నూలు, మంత్రాలయం, నందవరం, ఓర్వకల్లు, పగిడ్యాల, పత్తికొండ, పెద్దకడుబూరు, రుద్రవరం, ఉయ్యాలవాడ, ఎమ్మిగనూరు మండలాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు. 9వ తేదీన ఆదోని, ఆలూరు, ఆస్పరి, బనగానపల్లె, బేతంచర్ల, చిప్పగిరి, దేవనకొండ, డోన్, హొళగుంద, కొలిమిగుండ్ల, కౌతాళం, కృష్ణగిరి, మద్దికెర, పత్తికొండ, ప్యాపిలి, తుగ్గలి, వెల్దుర్తి మండలాల్లో వర్ష సూచన ఉందని తెలిపారు. రాబోయే ఐదు రోజులు ఆకాశం పొడిగా లేదా పాక్షికంగా మేఘావృతమై ఉంటుందన్నారు. సరాసరి ఉష్ణోగత్రలు పగలు 35.9-40.0 డిగ్రీలుగా, రాత్రి 23.4-27.6 డిగ్రీలుగా ఉంటుందని శాస్త్రవేత్త తెలిపారు.
Updated Date - 2021-05-05T04:56:25+05:30 IST