ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రుచుల కలబోత

ABN, First Publish Date - 2021-04-13T05:04:13+05:30

రుచుల పండగ ఉగాది. జీవితంలోని అన్ని అనుభవాలను, ఉద్వేగాలను, ఆనంద విషాదాలను సమంగా స్వీకరించాలని, కలిపి ఆస్వాదించాలని చాటే పండుగ తెలుగు సంవత్సరాది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. నేడు ఉగాది పర్వదినం
  2. ప్లవ నామ సంవత్సరం ఆరంభం


కర్నూలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 12: రుచుల పండగ ఉగాది. జీవితంలోని అన్ని అనుభవాలను, ఉద్వేగాలను, ఆనంద విషాదాలను సమంగా స్వీకరించాలని, కలిపి ఆస్వాదించాలని చాటే పండుగ తెలుగు సంవత్సరాది. ఉగాది పచ్చడిలోని అర్థం ఇదే. షడ్రుచులు కలిసే ఉగాది పచ్చడిని ఆస్వాదించడం సంప్రదాయం. తెగులు సంస్కృతినంతా కలబోసినట్లు ఉండే ఉగాది రోజు అంతా నిత్యనూతనమే. లేత చిగురుల మామిడి తోరణాలు ఇండ్లకు కడతారు. 

ముగ్ధమనోహరమైన బంతిపూల హారాలను అలంకరిస్తారు. ఘమ ఘమ లాడే పిండి వంటలు ఆరగిస్తారు. సాయంకాలం పంచాంగ శ్రవణానికి హాజరవుతారు. తెలుగు పంచాంగం ప్రకారం మంగళవారం ప్లవ నామ సంవత్సరం ఆరంభం కాబోతోంది. జిల్లా ప్రజలు ఉగాదికి స్వాగతం పలికేందుకు సిద్ధమవుతున్నారు. గత ఏడాది కరోనా లాక్‌డౌన్‌ నేపథ్యంలో గృహాలకే పరిమితమయ్యారు. ఈ ఏడాది కొంత వెసులుబాటు రావడంతో కరోనా జాగ్రత్తలతోనే వేడుకలు జరుపుకోనున్నారు. శ్రీశైలం, మహానంది తదితర పుణ్యక్షేత్రాల్లో కూడా ఉగాది వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆలయాల్లోనూ ఉదయం ప్రత్యేక పూజా కార్యక్రమాలు, సాయంత్రం పంచాంగ పఠనాలు ఏర్పాటు చేశారు. టీటీడీ, ధర్మప్రచార పరిషత్‌తోపాటు వివిధ ధార్మిక సంస్థల ఆధ్వర్యంలో ఉగాది పచ్చడి పంపిణీ, పంచాంగ శ్రవణాలు ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-04-13T05:04:13+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising