ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నాకు 16.. కాదు అన్నీ నాకే!

ABN, First Publish Date - 2021-02-25T05:51:56+05:30

నాకు 16 వార్డులు ఇవ్వాల్సిందేనని ఒకరు..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఎస్వీ మోహన్‌రెడ్డి వర్సెస్‌ హఫీజ్‌ఖాన్‌

హైదరాబాద్‌లో సర్దుబాటుకు యత్నం

ససేమిరా అన్న ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే


కర్నూలు: నాకు 16 వార్డులు ఇవ్వాల్సిందేనని ఒకరు..! ఊహు.. నాకే అన్నీ ఇవ్వాలని మరొకరు! వైసీపీలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మధ్య సీట్ల గొడవ ఇది. కార్పొరేషన్‌ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో వైసీపీలోని నాయకుల మధ్య విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. కర్నూలు నియోజకవర్గ పరిధిలో 33 వార్డులు ఉండగా.. అభ్యర్థిత్వాలు తమవారికి ఇప్పించేందుకు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌, మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఈ నేపథ్యంలో వీరి పంచాయితీ అధినాయకత్వం వద్దకు చేరింది. మంగళవారం హఫీజ్‌ఖాన్‌, ఎస్వీ మోహన్‌రెడ్డిని పిలిపించి సర్దుబాటు చేసేందుకు యత్నించారు. కానీ ఇద్దరూ ఒక తాటిపైకి రాలేక పోయారు.


33 వార్డుల్లోనూ తన అభ్యర్థులనే బరిలో ఉంచుతానని హఫీజ్‌ ఖాన్‌ అధినాయకత్వం వద్ద వాదించినట్లు సమాచారం. దీనికి ఎస్వీ మెహన్‌రెడ్డి అభ్యంతరం చెబుతూ తన వారికి 16 వార్డులను కేటాయించాలని పట్టుబట్టారు. ఇప్పటికే అభ్యర్థులు నామినేషన్‌ వేశారని, వారందరినీ గెలిపించుకునే బాధ్యత తనదని వాదించినట్లు తెలిసింది. ఇందుకు హఫీజ్‌ ఖాన్‌ స్పందిస్తూ ఎట్టిపరిస్థితుల్లోనూ తన అభ్యర్థులకు బీ పారాలు ఇచ్చి గెలిపించుకుంటానని స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మంగళవారం రాత్రి పొద్దుపోయే వరకు సాగిన చర్చలు కొలిక్కి రాకపోవడంతో గురువారానికి వాయిదా వేసినట్లు తెలుస్తోంది.


Updated Date - 2021-02-25T05:51:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising