ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘విద్యార్థుల జీవితాలతో చెలగాటం మంచిది కాదు’

ABN, First Publish Date - 2021-05-17T05:06:28+05:30

కొవిడ్‌ ప్రబలుతున్న సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం ప్రభుత్వానికి మంచిది కాదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజ నేయులు అన్నారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆదోని, మే 16: కొవిడ్‌ ప్రబలుతున్న సమయంలో విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడటం ప్రభుత్వానికి మంచిది కాదని టీఎన్‌ఎస్‌ఎఫ్‌ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు రామాంజ నేయులు అన్నారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేఖరులతో మాట్లాడారు. పది, ఇంటర్‌ పరీక్షలు రద్దు చేయాలని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ ప్రభుత్వానికి లేఖ రాస్తే, పరీక్షలు నిర్వహిస్తామని సమాధానం ఇవ్వడం సరికాదని అన్నారు. రాష్ట్రంలో ఇప్పటికే పది లక్షల కొవిడ్‌ కేసులు నమోదయ్యాయని, 7500 మంది మృతిచెందారని అన్నారు. రోజుకు 10 వేల కేసులు నమోదు అవుతున్న సమయంలో ఆసుపత్రుల్లో బెడ్లు, ఆక్సిజన్‌, మందులు దొరకడం లేదని అన్నారు. ఇలాంటి సమయంలో విద్యార్థులకు పరీక్షలు నిర్వహించడానికి సన్నాహాలు చేయడం బాధ్యతారాహిత్యమని అన్నారు. ఇప్పటికైనా సీఎం జగన్‌రెడ్డి మొండి పట్టును వీడి, పరీక్షలను రద్దు చేయాలని, లేదంటే పెద్దఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. సమావేశంలో నాయకులు సూర్య, నూర్‌, అభి, ఆది, సిద్దు పాల్గొన్నారు.  

Updated Date - 2021-05-17T05:06:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising