ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇదీ.. పాలన

ABN, First Publish Date - 2021-08-03T05:47:21+05:30

కౌతాళం పట్టణానికి చెందిన లింగమ్మ, లక్ష్మన్న దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కౌతాళం  పట్టణానికి చెందిన లింగమ్మ, లక్ష్మన్న దంపతులు కూలి పనులు చేసుకుని జీవిస్తుంటారు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఎక్కడా సెంటు స్థలం లేదు. పొలాలు కూడా లేవు. అద్దె స్థలంలో రేకుల కొట్టం వేసుకుని ఉంటున్నారు. రేషన్‌ బియ్యంతో ఊరట పొందేవారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఏడాదిన్నర క్రితం రేషన్‌ కార్డును తొలగించారు. వలంటీరును, సచివాలయ సిబ్బందిని కలిసి అడిగితే.. ‘మీకు 18 ఎకరాల భూమి ఉంది. అందుకే కార్డు రద్దు అయింది..’ అని చెప్పారు. దీంతో బాధితులు అవాక్కయ్యారు. రెక్కాడితేగాని డొక్కాడని తమకు అంత భూమి ఎక్కడిదని, సొంత ఇల్లు కూడా లేదని గోడు వెల్లబోసుకున్నారు. రేషన్‌ బియ్యం వస్తే తమకు ఓ పూట కడుపు నిండుతుందని అధికారులను కలిసి వేడుకున్నారు. పరిశీలించిన తహసీల్దారు చంద్రశేఖర వర్మ, వారికి భూమి లేదని ఎండార్స్‌మెంట్‌ లెటర్‌ ఇచ్చారు. దాని ఆధారంగా వార్డు సచివాలయంలో ఫిర్యాదు చేశారు. కానీ ఆన్‌లైన్‌లో తిరస్కరించారని, ఎంపీడీవోను కలవాలని సిబ్బంది సూచించారు. ఎంపీడీవో సూర్యనారాయణను కలిస్తే.. భూమి సమస్య కాబట్టి తహసీల్దారు వద్దకు వెళ్లమన్నారు. పౌర సరఫరాలు తమ పరిధిలో లేవని, సచివాలయంలోనే పరిష్కరించుకోవాలని తెలిపారు. బాధితులు ఇలా ఏడాదిన్నర నుంచి సచివాలయం, తహసీల్దారు కార్యాలయం, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. స్పందించే గుణం లేని అధికారులు, సిబ్బంది ఉన్నప్పుడు.. ఎంతమందిని కలిస్తే ఏం ప్రయోజనం..! ఉన్నతాధికారులైనా స్పందించి.. రేషన్‌ కార్డు ఇప్పించాలని బాధితులు కోరుతున్నారు.                                       - కౌతాళం

Updated Date - 2021-08-03T05:47:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising