ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇది రాక్షస పాలన

ABN, First Publish Date - 2021-10-23T06:14:21+05:30

రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి రాక్షస పాలన కొనసాగిస్తున్నదని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు.

మంగళగిరిలో టీడీపీ జిల్లా నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  మూల్యం చెల్లించుకోక తప్పదు
  2.  టీడీపీ జిల్లా నాయకుల హెచ్చరిక 
  3. చంద్రబాబు దీక్షకు సంఘీభావం


కర్నూలు(అగ్రికల్చర్‌), అక్టోబరు 22: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిని గాలికొదిలేసి రాక్షస పాలన కొనసాగిస్తున్నదని తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల జయ సూర్య ప్రకాష్‌రెడ్డి, కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబునాయుడు చేపట్టిన నిరసన దీక్షకు జిల్లాకు చెందిన టీడీపీ నేతలందరూ తరలివెళ్లారు. ఈ సందర్భంగా కోట్ల సూర్య ప్రకాష్‌రెడ్డి, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు వై.నాగేశ్వరరావు యాదవ్‌, నాగేంద్ర కుమార్‌ ఫోన్‌లో విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు నిరసన దీక్షకు రాష్ట్రం నలుమూలల నుంచి ప్రజలు తరలివస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డి మాట్లాడుతూ అధికార పార్టీ దమనకాండపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ కేంద్ర కార్యాలయం, రాష్ట్ర అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ ఇంటిపై దాడులు, పార్టీ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండించారు. తమ నేత చంద్రబాబు నాయుడు చేపట్టిన 36 గంటల నిరసన దీక్ష విజయవంతమైందని, రాష్ట్ర ప్రజలంతా వైసీపీ ప్రభుత్వ దమనకాండపై ముక్తకంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారని అన్నారు. వైసీపీ ఫ్యాక్షనిజానికి అధికారం తోడైందని, దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారని విమర్శించారు. కోడుమూరు టీడీపీ ఇన్‌చార్జి ఆకేపోగు ప్రభాకర్‌, గూడూరు మండల టీడీపీ అధ్యక్షుడు సుధాకర్‌ రెడ్డి, పట్టణ టీడీపీ అధ్యక్షుడు గజేంద్ర గోపాల్‌ నాయుడు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-23T06:14:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising