ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ చేతిలో ప్రజాస్వామ్యం ఖూనీ

ABN, First Publish Date - 2021-03-02T05:50:31+05:30

వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. చంద్రబాబును అరెస్టు చేయడం సిగ్గుచేటు
  2. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి


మంత్రాలయం, మార్చి 1: వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి తిక్కారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం కోసం వెళ్లిన టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడం సిగ్గుచేటని అన్నారు. ఇలాంటి ప్రభుత్వాన్ని ఎప్పుడూ చూడలేదని అన్నారు. చంద్రబాబును అడ్డుకోవడంపై ఆయన సోమవారం ఫోన్‌ ద్వారా స్పందించారు. ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఎక్కడైనా తిరిగే హక్కు ఉంటుందని అన్నారు. పార్టీ గుర్తుపై ఎన్నికలు జరుగుతున్నందున, పార్టీ అధ్యక్షుడు వెళ్లి ప్రచారం చేసే హక్కు ఉంటుందని అన్నారు. కక్షపూరితంగా వ్యవహరిస్తూ చంద్రబాబును పోలీసులు అరెస్టు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వైసీపీ దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ ఆగడాలను ప్రజలు చూస్తున్నారని, తిరుగుబాటు తప్పదని అన్నారు. వైసీపీ నాయకులు రోడ్డుపై కూడా తిరగలేని పరిస్థితి ఉంటుందని హెచ్చరించారు.

 

‘చంద్రబాబును అడ్డుకోవడం దారుణం’

గోనెగండ్ల: రాష్ట్రంలో రాక్షసరాజ్యం నడుస్తోందని తెలుగుయువత కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధికార ప్రతినిధి రంగస్వామినాయుడు, నాయకులు తిరుపతయ్య నాయుడు, దరగలమాబు, చెన్నల రాయుడు, నూరహమ్మద్‌, యూనుష్‌ అన్నారు. మాజీ సీఎం చంద్రబాబును రేణిగుంట విమానాశ్రయంలో అడ్డుకోవడం దారుణమని వారు అన్నారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో ప్రభుత్వ తీరుపై సోమవారం నిరసన తెలిపారు. టీడీపీకి ప్రజాబలం పెరుగుతోందని, అందుకే వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తోందని అన్నారు. మున్సిపల్‌, కార్పోరేషన్‌ ఎన్నికల బరిలో దిగిన టీడీపీ అభ్యర్థులను వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు ధైర్యం చెప్పేందుకు వెళుతున్న చంద్రబాబును విమానశ్రయంలో అడ్డుకోవడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వం తన దోరణి మార్చుకోవాలని, లేదంటే ప్రజలే బుద్ధి చెపుతారని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ నాగన్న, పూజారీ రంగస్వామి, రాంపురం రఫీక్‌, సురేష్‌, రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-02T05:50:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising