ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ట్రయేజ్‌లో బెడ్లు లేవు

ABN, First Publish Date - 2021-05-08T05:36:43+05:30

కరోనా బాధితులకు ట్రయేజ్‌ అత్యంత కీలకం.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


 కర్నూలు(హాస్పిటల్‌), మే 7: కరోనా బాధితులకు ట్రయేజ్‌ అత్యంత కీలకం. పెద్దాసుపత్రిలోని ఈ వార్డులో 80 పడకలు ఉంటే రోజూ 100పైగా బాధితులు చికిత్స పొందుతుంటారు. ఈ వార్డులోనే బాధితులకు ఆక్సిజన్‌ శాచ్యురేషన్‌, సిటీ స్కాన్‌ వంటి పరీక్షలు చేయించి ఆ తర్వాత వార్డులకు పంపాలి. అయితే వార్డుల్లో బెడ్ల కొరత వల్ల ట్రయేజ్‌లో నేలపైనే చికిత్స అందిస్తున్నారు. మూడురోజులైనా ట్రయేజ్‌లోనే ఉండాల్సి వస్తోందని బాధితుల బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా బెడ్లు లేకపోవడంతో వైద్యులు, సిబ్బంది కూడా ఏం చేయలేని పరిస్థితి. ప్రతిరోజూ ఆసుపత్రిలో ఖాళీగా ఉన్న బెడ్ల వివరాలు అధికారులు చెబితే బాధితులు వెళ్లి చికిత్స చేయించుకోడానికి వీలుంటుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.


ఈయన వయస్సు 70. ఆదోని మండలంలోని ఓ గ్రామం. కొవిడ్‌ లక్షణాలతో గురువారం రాత్రి కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి ట్రయేజ్‌కు వచ్చారు. ఇక్కడ రాత్రి నుంచి బెడ్‌ దొరక్కపోవడంతో నేలపైనే ఉంచి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. శుక్రవారం ఉదయం కూడా ట్రయేజ్‌లో బెడ్‌ దొరకలేదని బంధువులు తెలిపారు.



ఈయన వయసు 68. ఊరు డోన్‌ మండలం వెంకటనాయునిపల్లె. ఈ నెల 4వ తేదీన ట్రయేజ్‌లో చేరారు. 7వ తేదీ ఉదయం కూడా బెడ్‌ దొరక లేదు.





Updated Date - 2021-05-08T05:36:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising