ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరికి తెగుళ్ల బెడద

ABN, First Publish Date - 2021-11-02T05:30:00+05:30

మండలంలో ఖరీఫ్‌ చివరి సమయంలో సాగు చేసిన వరి పైరుకు తాటాకు తెగుళ్లు, ఉల్లికోడు, దోమపోటు ఆశించింది.

తాటాకు తెగుళ్లు సోకిన వరి పైరు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఆందోళనలో రైతులు


రుద్రవరం, నవంబరు 2: మండలంలో ఖరీఫ్‌ చివరి సమయంలో సాగు చేసిన వరి పైరుకు తాటాకు తెగుళ్లు, ఉల్లికోడు, దోమపోటు ఆశించింది. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. మండలంలోని 21 గ్రామ పంచాయతీల పరిధిలో 17 వేల ఎకరాల్లో వరి సాగు చేశారు. కంకి దశలో ఉన్న సమయంలో దోమపోటు, తాటాకు తెగుళ్లు సోకడంతో దిగుబడి తగ్గిపోతుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ముందే వరి పంటకు గిట్టుబాటు ధర లేక గత ఏడాది పండించిన ధాన్యాన్ని అమ్ముకోలేక అలాగే నిల్వ ఉంచామని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


వరి పైరుకు తాటాకు తెగుళ్లు

వరి పైరుకు తాటాకు తెగుళ్లు సోకింది. మందులు పిచికారీ చేస్తున్నాం. పెట్టుబడి పెరిగి దిగుబడి తగ్గుతుంది. ధాన్యానికి గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నాం.

 - నరసింహుడు, రైతు, కోటకొండ


వరి పైరుకు దోమపోటు

వరి పైరుకు దోమపోటు ఆశించడంతో మందులు పిచికారీ చేస్తున్నాం. వరి పైరు సాగు చేయాలంటే ఆందోళనగా ఉంది. పెట్టుబడి పెరుగుతోంది. వరి ధాన్యానికి గిట్టుబాటు ధర లేదు.

 - వెంకటపతి, రైతు, కోటకొండ 


రైతులకు సలహాలు ఇస్తున్నాం

వరి పైరులో ఆశించిన తెగుళ్ల గురించి దోమపోటు నివారణకు ఎప్పటికప్పుడు రైతులకు సలహాలు, సూచనలు ఇస్తున్నాం. గ్రామాలు తిరిగి పొలంబడి నిర్వహించి ఏ దశలో ఏ తెగులుకు ఏ మందు పిచికారీ చేయాలో రైతులకు వివరించాం. 

 - ప్రసాదురావు, ఏవో, రుద్రవరం



Updated Date - 2021-11-02T05:30:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising