ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాత్రి నడిరోడ్డుపై.. అత్యంత జన సమ్మర్థం ఉండే ప్రాంతంలో జరిగిన ఘోరమిది!

ABN, First Publish Date - 2021-09-16T05:34:48+05:30

పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌ ఏరియాలో తిరివీధి వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని బుధవారం రాత్రి నడిరోడ్డుపై దుండగులు నరికి చంపారు.

ఘటనా స్థలాన్ని పరిశీలిస్తున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తిరివీధి వెంకట సుబ్బయ్యపై కత్తులు, వేటకొడవళ్లతో దాడి

హతుడుది నంద్యాల జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్ అధ్యక్షుడు

ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ చిదానంద రెడ్డి


నంద్యాల(నూనెపల్లె): పట్టణంలోని బాలాజీ కాంప్లెక్స్‌ ఏరియాలో తిరివీధి వెంకటసుబ్బయ్య అనే వ్యక్తిని బుధవారం రాత్రి నడిరోడ్డుపై దుండగులు నరికి చంపారు. పట్టణంలో అత్యంత జన సమ్మర్థం ఉండే ప్రాంతంలో హత్య జరగడంతో స్థానికులు భయాందోళన చెందారు. టీ తాగేందుకు వచ్చిన వెంకట సుబ్బయ్యపై దుండగులు పథకం ప్రకారం కాపుకాసి వేట కొడవళ్లు, కత్తులతో విచక్షణారహితంగా దాడి చేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు, నంద్యాల పట్టణంలోని కోట వీధికి చెందిన తిరివీధి వెంకటసుబ్బయ్య (65)కు భార్య వెంకటసుబ్బమ్మ, ఇద్దరు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఆయన రెండో కుమారుడు నీటి ప్రమాదంలో మృతిచెందాడు.


వెంకట సుబ్బయ్యకు కోట వీధిలో కిరాణం అంగడి, ఫైనాన్స్ వ్యాపారం ఉన్నాయి. కొన్ని సంవత్సరాల నుంచి ‘ది నంద్యాల జనరల్‌ మర్చంట్స్‌ అసోసియేషన్’ అధ్యక్షుడిగా, కోట వీధిలోని సత్యనారాయణ స్వామి దేవస్థానం చైర్మన్‌గా ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. 25 సంవత్సరాల క్రితం కూడా తిరివీధి వెంకటసుబ్బయ్యపై హత్యాయత్నం జరిగింది. వెంకట సుబ్బయ్య హత్యతో నంద్యాల పట్టణం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. విషయం తెలుసుకున్న డీఎస్పీ చిదానందరెడ్డి, పట్టణ సీఐలు ప్రభాకర్‌రెడ్డి, మోహన్ రెడ్డి, ఎస్‌ఐలు, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు.


హత్య జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. స్థానికుల నుంచి ప్రాథమిక సమాచారాన్ని సేకరించారు. హత్య జరిగిన చోటుకి ప్రజలు అధిక సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌ను కంట్రోల్‌ చేయడం పోలీసులకు ఇబ్బందికరంగా మారింది. హత్యకు గల కారణాలపై పోలీస్‌ అధికారులు ఆరా తీస్తున్నారు. హత్యకు పాల్పడిన దుండగులను పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్లు డీఎస్పీ చిదానంద రెడ్డి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 




Updated Date - 2021-09-16T05:34:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising