ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఘనంగా ఏరువాక పౌర్ణమి

ABN, First Publish Date - 2021-06-25T05:20:51+05:30

మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనాపురం, సోమయాజులపల్లె తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమిని గురువారం ఘనంగా జరుపుకున్నారు.

పొలాన్ని దుక్కి దున్నుతున్న రైతు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఓర్వకల్లు, జూన్‌ 24: మండలంలోని ఓర్వకల్లు, కన్నమడకల, ఉయ్యాలవాడ, ఉప్పలపాడు, హుశేనాపురం, సోమయాజులపల్లె తదితర గ్రామాల్లో  ఏరువాక పౌర్ణమిని గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా రైతులు పొలాలను దుక్కి దున్నారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతుల సంబరాలు నిర్వహించి ప్రజాప్రతినిధుల సమక్షంలో పొలాలను దున్నారు. అయితే.. ఈ ప్రభుత్వం ఏరువాక పౌర్ణమి సందర్భంగా రైతులకు ఎలాంటి ప్రోత్సాహం అందించలేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ ఏడాది రైతులు సుఖసంతోషాలతో ఉండి.. వర్షాలు సకాలంలో రావాలని రైతులకు మంచి పంటలు పండాలని, గిట్టుబాటు ధర ఉండాలని రైతులు దేవుడ్ని ప్రార్థిస్తూ పొలాల్లో దుక్కి దున్నారు.


చాగలమర్రి: మండలంలోని చిన్నవంగలి, పెద్దవంగలి, పెద్దబోదనం, మల్లేవేముల, ముత్యాలపాడు తదితర గ్రామాల్లో ఏరువాక పౌర్ణమి సందర్భంగా గురువారం రైతులు గ్రామ దేవతలకు పూజలు చేసి వ్యవసాయ పనులు ప్రారంభించారు. గ్రామాల్లో పత్తి, పసుపు విత్తనాలను నాటేందుకు మహిళా కూలీలచే పనులు ప్రారంభించారు. 



Updated Date - 2021-06-25T05:20:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising