పునీత్ రాజ్‌కుమార్ మృతి విచారకరం
ABN, First Publish Date - 2021-10-30T05:15:52+05:30
కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.
- రాఘవేంద్ర స్వామి మఠంతో విడదీయరాని బంధం
- సంతాపం తెలిపిన పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు
మంత్రాలయం, అక్టోబరు 29: కన్నడ సినీ నటుడు పునీత్ రాజ్‌కుమార్ మృతి పట్ల మంత్రాలయం రాఘవేంద్ర స్వామి మఠం పీఠాధిపతి సుభుదేంద్ర తీర్థులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. మఠంతో పునీత్ రాజ్ కుమార్ కుటుంబానికి విడదీయరాని అనుబంధం ఉందని పీఠాధిపతి పేర్కొన్నారు. ఆయన తండ్రి రాజ్‌కుమార్ రాఘవేంద్రస్వామిపై ఎన్నో ఆధ్యాత్మిక గీతాలు ఆలపించారని, చిత్రాల్లో నటించారని గుర్తు చేసుకున్నారు. పునీత్ రాజ్‌కుమార్ తల్లి, సోదరులు రాఘవేంద్రస్వామికి పరమ భక్తులు అని అన్నారు. రాఘవేంద్రస్వామి 350వ ఆరాధన ఉత్సవాల్లో పునీత్ పాల్గొని తన ఆశీస్సులు పొందారని తెలిపారు. చిన్న వయసులో ఆయన మరణం బాధాకరమని సంతాపం తెలిపారు. పునీత్ రాజ్‌కుమార్ ఆత్మకు శాంతి కలగాలని పీఠాధిపతి ఆకాంక్షించారు.
Updated Date - 2021-10-30T05:15:52+05:30 IST