నీటికుంటలో పడి చిన్నారి మృతి
ABN, First Publish Date - 2021-10-30T05:00:27+05:30
నంద్యాల మండలం కానాల గ్రామంలో నీటికుంటలో పడి మహమ్మద్ ఇస్మాయిల్ (2) అనే చిన్నారి శుక్రవా రం మృతిచెందాడు.
నంద్యాల(నూనెపల్లె), అక్టోబరు 29: నంద్యాల మండలం కానాల గ్రామంలో నీటికుంటలో పడి మహమ్మద్ ఇస్మాయిల్ (2) అనే చిన్నారి శుక్రవా రం మృతిచెందాడు. తాలుకా అర్బన్ సీఐ మురళీమోహనరావు తెలిపిన వివరాల మేరకు, కానాల గ్రామానికి చెందిన మౌలాలి, భాను దంపతులకు ముగ్గురు సంతానం. చిన్నకుమారుడైన మహమ్మద్ ఇస్మాయిల్ ఇంటి ఆవరణంలో ఆడుకుంటూ సమీపంలో ఉన్న నీటికుంటలో ప్రమాదవశాత్తూ పడి మృతిచెందాడు. విషయం తెలుసుకున్న తాలుకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని బాలుడి మృతదేహాన్ని బయటకు తీశారు. పోస్టుమార్టం నిమిత్తం నంద్యాల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Updated Date - 2021-10-30T05:00:27+05:30 IST