ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

లోయలో పడ్డ బస్సు

ABN, First Publish Date - 2021-11-30T05:35:42+05:30

ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం 25 అడుగుల లోతున్న లోయలో పడింది. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.

లోయలో పడ్డ ఆర్టీసీ బస్సు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


ఆళ్లగడ్డ, నవంబరు 29: ఎగువ అహోబిలంలో ఆర్టీసీ బస్సు సోమవారం ఉదయం 25 అడుగుల లోతున్న లోయలో పడింది. ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. వీరిని ఆళ్లగడ్డ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఏపీ 28 జడ్‌ 5842నెంబరు గల ఆళ్లగడ్డ ఆర్టీసీ డిపో బస్సు ఉదయం 10.30 గంటలకు ఎగువ అహోబిలంలో బయలుదేరింది. డ్రైవరు జేకే బాషా రివర్స్‌ చేసుకునే ప్రయత్నంలో బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఆ సమయంలో బస్సులో డ్రైవరుతో కలిపి నలుగురు ఉన్నారు. ఓబులేసు(మైదుకూరు), వెంకటలక్ష్మమ్మ (ధర్మవరం) స్వల్పంగా గాయపడ్డారు. డ్రైవరు, మరో వ్యక్తి సురక్షితంగా బయట పడ్డారు. నంద్యాల ఆర్టీసీ డీవీఎం, నంద్యాల ఇనచార్జి ఆర్డీవో మల్లికార్జునుడు, ఆర్టీసీ డీఎం రాజశేఖరరెడ్డి, తహసీల్దార్‌ రమేష్‌రెడ్డి, రూరల్‌ సీఐ రాజశేఖరరెడ్డి, అహోబిలం ఈవో నరసయ్య అక్కడికి వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. రూరల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ అధికారులు సోమవారం సాయంత్రం బస్సును లోయలో నుంచి బయటకు తీశారు. ప్రమాదంపై ఆర్టీసీ ఉన్నతాధికారులు విచారణ చేపట్టారు. ప్రయాణికులు సురక్షితంగా బయట పడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.


Updated Date - 2021-11-30T05:35:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising