ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రంజాన్‌ మాసం ఆరంభం

ABN, First Publish Date - 2021-04-14T05:03:18+05:30

ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఆధ్యాత్మిక మాసం రంజాన్‌ మొదలైంది. జిల్లాలో మంగళవారం రాత్రి నెలవంక దర్శనమిచ్చింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

8 నేటి నుంచి ఉపవాస దీక్షలు


కర్నూలు (కల్చరల్‌), ఏప్రిల్‌ 13: ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఆధ్యాత్మిక మాసం రంజాన్‌ మొదలైంది. జిల్లాలో మంగళవారం రాత్రి నెలవంక దర్శనమిచ్చింది. దీంతో బుధవారం నుంచి ఉపవాసదీక్షలు పాటించేందుకు ముస్లిం లు సిద్ధమయ్యారు. ఇఫ్తార్‌ సమయంలో దీక్షల విరమణ తర్వాత స్వీకరించేందుకు అల్పాహారాలను సిద్ధం చేసుకుంటు న్నారు. ముస్లింలు ఈ నెల రోజుల పాటు రోజా పాటించి, తమని తాము సమున్నతంగా తీర్చిదిద్దుకుంటారు. నిత్య నమాజులు, దానధర్మాలతో ఈ మాసం మొత్తం దైవ చింతనతో గడుపుతారు.


దివ్య ఖురాన్‌ అవతరించిన నెల
రంజాన్‌ నెలలోనే పవిత్ర గ్రంథం ‘దివ్య ఖురాన్‌’ అవతరించింది. మానవాళికి ఖురాన్‌ గ్రంథం మార్గదర్శనం చేసింది. సత్యాసత్యాలను వేరుచేసే స్పష్టమైన ఆదేశాలు ఈ గ్రంథంలో ఉన్నాయి. రంజాన్‌ మాసంలో అధికంగా దైవ ధ్యానం చేయాలని, దివ్య ఖురాన్‌ను ఒకసారైనా పఠించాలని మహ్మద్‌ ప్రవక్త బోధించారు. ఈ లక్ష్య సాధన కోసం నెలంతా ‘తరావీహ్‌ నమాజ్‌’లో దివ్య ఖురాన్‌ గ్రంథాన్ని పఠిస్తారు. రంజాన్‌ మాసంలో ఉపవాస దీక్షతోపాటు రోజూ ఐదు పూటలా నమాజ్‌ చేస్తారు. దీనికి అదనంగా రాత్రి ఇషా నమాజ్‌, ఆ తర్వాత 20 రకాతుల తరావీహ్‌ నమాజులు ఆచరిస్తారు.


దైవం పట్ల విశ్వాసం
దైవం పట్ల అత్యంత విశ్వాసం, భీతి, ధార్మిక చింతన ఉన్న ముస్లింలంతా రంజాన్‌ మాసంలో నెలవంక చూడగానే ఉపవాస దీక్షలు ఆరంభిస్తారు. అది విశ్వ ప్రభువు తమపై మోపిన విధిగా భావిస్తారు. ప్రతి యుగంలోనూ దైవ ప్రవక్తలు ఉపవాసాన్ని విశ్వాసులకు విధిగా నిర్ణయించారని మత పెద్దలు పేర్కొన్నారు. దివ్య ఖురాన్‌లో ఈ విషయాన్ని ‘విశ్వాసులారా! మీకు పూర్వం దైవ ప్రవక్తల్ని అనుసరించే వారికి ఎలా ఉపవాసం విధిగా చేయబడిందో.. మీపైకూడా అలాగే ఉపవాసం విధిగా నిర్ణయించబడింది. దీనివల్ల మీలో భయభక్తులు జనించగలవు’ అని తెలియజేశారని గుర్తు చేస్తున్నారు. ప్రతి మనిషి ప్రపంచంలో తాను చేసుకున్న కర్మలకు మరణాంతరం పరలోకంలో విశ్వ పాలకుని ముందు సమాధానం ఇచ్చుకోవాల్సి ఉంటుందని, కర్మల అనుసారంగా ప్రతిఫలం అనుభవించాల్సి ఉంటుందని మత పెద్దలు ఉద్బోధిస్తారు. విశ్వాసి మదిలో నిరంతరం మెదిలే ఈ భావనే దైవభీతి అని, సరైన దైవభీతి కలిగినవారు పాపాలకు,  చెడులకు, ఇతర అధర్మ కార్యకలాపాలకు దూరంగా మసులుకుంటారని చెబుతారు.

Updated Date - 2021-04-14T05:03:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising