ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇళ్ల కూల్చివేతతో ఉద్రిక్తత

ABN, First Publish Date - 2021-11-30T05:34:09+05:30

నగరంలోని బంగారుపేటలో కేసీ కెనాల్‌ వెంట ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది.

ఇళ్లను కూల్చివేస్తున్న ఎక్స్‌కవేటర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ధర్నాకు దిగిన బాధిత కుటుంబాలు 
  2. ప్రత్యామ్నాయం చూపుతాం: డీసీపీ  


కర్నూలు(అర్బన), నవంబరు 29: నగరంలోని బంగారుపేటలో కేసీ కెనాల్‌ వెంట ఇళ్ల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. కెనాల్‌ వెంట 500 మీటర్ల పొడవున ఉన్న దాదాపు 60 ఇళ్లు, రేకుల షేడ్లు, గుడిసెలు ఉండగా.. 25 షెడ్లు, ఇళ్లను ఎక్స్‌కవేటర్‌తో మున్సిపల్‌ అధికారులు సోమవారం కూల్చి వేశారు. దీంతో బాధిత కుటుంబాలు ధర్నాకు దిగాయి. కొందరు మహిళలు తమ చేతులను కోసుకుంటామంటూ అధికారులు, పోలీసులను బెదిరించారు. అడ్డుపడిన వారిని పోలీసులు బయటకు లాక్కెళ్లారు. రింగ్‌ రోడ్డు కోసం కేసీ కెనాల్‌ వెంట నగర పాలక సంస్థ స్ధలాల్లో ఉన్న అక్రమ నిర్మాణాలను ఖాళీ చేయించామని, వారికి ప్రత్యామ్నాయం చూపుతామని డీసీపీ కోటయ్య తెలిపారు. ఇప్పటికే పలుమార్లు నోటీసులు జారీ చేశామన్నారు. బాధిత కుటుంబాలను రాయలసీమ పట్టణ నిరాశ్రయుల కేంద్రానికి తరలించారు. 


Updated Date - 2021-11-30T05:34:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising