ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హైకోర్టు ఏర్పాటులో జాప్యమెందుకు?

ABN, First Publish Date - 2021-01-19T06:04:40+05:30

హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు.

మాట్లాడుతున్న తెలకపల్లి రవి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి


కర్నూలు(కల్చరల్‌), జనవరి 18: హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడంలో జాప్యం ఎందుకు చేస్తున్నారని  ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు తెలకపల్లి రవి అన్నారు. హైకోర్టు కర్నూలుకు రావడం  ఏకాభిప్రాయం అని, అయినా హైకోర్టు ఏర్పాటు కావ డం లేదని, దీనిపై అన్ని రాజకీయ పార్టీలు మౌనం వీడాలని ఆయన కోరారు.  సోమవారం  సి. క్యాంపులోని టీజీవీ కళాక్షేత్రంలో ఏర్పాటు చేసిన టి. నరసింహయ్య ద్వితీయ వర్ధంతి, రైతు ఉద్యమ సదస్సుకు ముఖ్య వక్తగా విచ్చేసిన ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలకపల్లి రవి మాట్లాడుతూ హైకోర్టును కర్నూలులో ఏర్పాటు చేయడంలో ఏ రాజకీయ పార్టీకి అభ్యంతరం లేనందున కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చేలా కృషి చేయాలని కోరారు. రాష్ట్రంలో అప్పులు, ఆర్థిక సమస్యలు, కోరోనా వంటి అతిపెద్ద సమస్యలు ఉండగా వీటిని పక్కనపెట్టి ఆలయాలపై దాడులను అసలైన సమస్యగా ముందుకు తీసుకురావడం ఆందోళన కలిగించే విషయమని చెప్పారు. ఈ సమావేశంలో సుందరయ్య విజ్ఞాన కేంద్రం కో ఆర్డినేటర్‌ జేఎన్‌ శేషయ్య, సాహితీ స్రవంతి రాష్ట్ర కార్యదర్శి జంధ్యాల రఘుబాబు, నగర కార్యదర్శి రంగస్వామి పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-19T06:04:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising