ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆ ఇద్దరు ఉపాధ్యాయుల సస్పెన్షన్‌

ABN, First Publish Date - 2021-01-19T06:01:26+05:30

ఉపాధ్యాయ బదిలీల్లో నిబంధనలు అతిక్రమించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో సాయిరాం సోమవారం తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(ఎడ్యుకేషన్‌), జనవరి 18: ఉపాధ్యాయ బదిలీల్లో నిబంధనలు అతిక్రమించిన ఇద్దరు ఉపాధ్యాయులను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో సాయిరాం సోమవారం తెలిపారు. ఇద్దరు ఉపాధ్యా యులు స్పౌజ్‌ కేటగిరి కింద నిబంధనలకు వ్యతి రేకంగా బదిలీ ఆప్షన్లు ఇచ్చుకుని అనుకూలమైన స్థానాలకు బదిలీ అయ్యారు. ఈ వ్యవహారంపై ఈనెల 17న ఆంధ్ర జ్యోతిలో ‘బదిలీ మాయ’ శీర్షికన కథనాన్ని ప్రచురించింది. దీంతో స్పందించిన అధికారులు విచారణ జరిపించారు. దేవనకొండ మండలం గుండ్లకొండ జడ్పీహె చ్‌ఎస్‌ పాఠశాలలో స్కూల్‌ అసిస్టెంట్‌ (ఇంగ్లీషు)గా పనిచేస్తున్న ఎస్‌బీఈ జయంత్‌ కుమార్‌ పత్తికొండ మండలం పుచ్చకాయలమాడ జడ్పీ ఉన్నత పాఠశాలకు బదిలీ అయ్యారు. అలాగే కోవెలకుంట్ల బాలికల ఉన్నత పాఠశాలలో పని చేసే స్కూల్‌ అసిస్టెంట్‌ (ఫిజికల్‌ సైన్స్‌) మల్లేశ్వరి ఓర్వకల్లు మండలం లొద్దిపల్లె హైస్కూల్‌కు బదిలీ ఉత్తర్వులు పొంది ఆ పాఠశాలలో జాయిన్‌ కూడా అయ్యారు. ఈమె భర్త నంద్యాల మండలం ట్రాన్స్‌కోలో పనిచేస్తున్నారు. విద్యాశాఖ నిబంధనల మేరకు స్పౌజ్‌ కేటగిరి కింద నంద్యాల మండలానికి లేదా సమీప మండలాల్లో పాఠశాల లకు ఆప్షన్లు పెట్టుకోవాల్సింది. అయితే నిబంధనలకు నీళ్లొదిలి కర్నూలు డివిజన్‌ లోని లొద్దిపల్లె హైస్కూల్‌కు బదిలీ అయ్యారు. ఆదోని, నంద్యాల ఉప విద్యాశాఖ అధికారులు మీనాక్షి, ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి తుది నివేదికను డీఈవోకు సమర్పించారు. ఈ విచారణలో నిబంధనలు ఉల్లం ఘించినట్లు రుజువు కావడంతో స్కూల్‌ అసిస్టెంట్లు మల్లేశ్వరి, జయంత్‌కుమార్‌ను సస్పెండ్‌ చేసినట్లు డీఈవో సాయిరాం సోమవారం తెలిపారు. 

Updated Date - 2021-01-19T06:01:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising