ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పీఆర్సీని తక్షణమే ప్రకటించాలి

ABN, First Publish Date - 2021-04-18T05:11:48+05:30

రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు పీఆర్సీ-2018ని తక్షణమే 55 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి


కర్నూలు(ఎడ్యుకేషన్‌), ఏప్రిల్‌ 17: రాష్ట్ర వ్యాప్తంగా పని చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ కార్మికులకు పీఆర్సీ-2018ని తక్షణమే 55 శాతం ఫిట్‌మెంట్‌తో ప్రకటించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి డిమాండ్‌ చేశారు. శనివారం కర్నూలులోని ఎస్టీయూ సలాంఖాన్‌ భవనంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పీఆర్సీపై తక్షణమే జేఏసీ నాయకులతో చర్చలు జరపాలన్నారు. ఉపాధ్యాయుల బోధనకు అంతరాయం కలిగించే అన్ని రకాల అంతర్జాల యాప్‌లను రద్దు చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఉమ్మడి సర్వీసు నిబంధనలను అమలు చేసి అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు జేఎల్‌, ఎంఈవో, డిప్యూటీ డీఈవో పదోన్నతులు కల్పించాలన్నారు. కస్తూర్బా పాఠశాలల టీచర్లకు కనీస వేతన చట్టం అమలు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కత్తి నరసింహా రెడ్డి డిమాండ్‌ చేశారు. ఆదర్శ పాఠశాలలను పాఠశాలల విద్యాశాఖలో విలీనం చేసి ఎయిడెడ్‌ పాఠశాలల విలీనంపై చర్యలు జరపాలన్నారు. సమావేశంలో ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.గోకారి, నారాయణ స్వామి, ప్రసాదరావు, పవిత్రన్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-04-18T05:11:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising