ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడికి కఠిన చర్యలేవీ..?: సోమిశెట్టి

ABN, First Publish Date - 2021-05-07T05:58:48+05:30

కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), మే 6: కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని  కర్నూలు లోక్‌సభ నియోజకవర్గం పార్టీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు ఆరోపించారు.  గురువారం కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ మద్యం షాపులు నిర్వహించడంలో ఉన్న శ్రద్ధ్ద కరోనాను కట్టడి చేయడంలో సీఎం జగన్‌ ప్రభుత్వానికి   లేదని   ధ్వజమెత్తారు. కర్నూలు నగరంలో నివాస ప్రాంతాల మధ్య కరోనా చికిత్స కోసం ప్రైవేటు ఆసుపత్రులకు అనుమతి ఇవ్వడం జిల్లా అధికార యంత్రాంగం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో అర్థమవుతోందన్నారు. వెంటనే రాష్ట్ర ముఖ్య మంత్రి జగన్‌ రాజకీయాలకు అతీ తంగా రాష్ట్రంలో కరోనా తీవ్రతను అరికట్టేందుకు బేష జాలకు పోకుండా విపక్షాల నేతల సలహాలు, సూచనలు వినాలని, మేధావులు, వైద్యులు చెప్పిన ప్రకారం కరోనా కట్టడికి చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. కలెక్టర్‌, ఇతర అధికారులు కరోనాను జిల్లాలో అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన సమర్థవంతంగా చర్యలు చేపట్టాలని సోమిశెట్టి విజ్ఞప్తి చేశారు.  కరోనా విషయంలో  ప్రజలను రక్షించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని కోరా రు. టీకాలు అందరికీ అంద జేయాలని డిమాండ్‌ చేస్తూ  8న తెలుగుదేశం పార్టీ ఆధ్వ ర్యంలో నిరసన కార్యక్ర మం చేపడుతున్నట్లు తెలిపారు. పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఆదేశాల మేరకు  ఈ కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు.  


Updated Date - 2021-05-07T05:58:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising