ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మచ్చలేని కుటుంబంపై కేసులా..?

ABN, First Publish Date - 2021-01-26T05:58:33+05:30

మచ్చలేని రాజకీయ కుటుంబంపై కేసులు పెట్టడం ఏమిటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌ ప్రశ్నించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1.  పంచాయతీ ఎన్నికల్లో సత్తా చాటుతాం
  2.   టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌


కోడుమూరు, జనవరి 25: మచ్చలేని రాజకీయ కుటుంబంపై కేసులు పెట్టడం ఏమిటని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ఆకెపోగు ప్రభాకర్‌ ప్రశ్నించారు. పట్టణంలోని పార్టీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.  జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు ఉన్న కేంద్ర మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ఉపాధ్యక్షుడు కోట్ల సూర్యప్రకాష్‌ రెడ్డిపై అక్రమంగా కేసులు నమోదు చేశారని ఆయన ఆరోపించారు. వెల్దుర్తి, పత్తికొండలో కార్య కర్తల సమావేశం నిర్వహించిన కోట్ల, కేఈ శ్యాంబాబు, మరికొందరు నాయ కులపై వైసీపీ ప్రభుత్వం కేసులు నమోదు చేయించడం దారుణమని అన్నారు. అఽధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున పాదయాత్ర చేసినప్పుడు, ప్రభుత్వ పథకాల ప్రచారం కోసం ప్రజలను ఒకచోటికి పిలిచి సభలు, సమావేశాలు నిర్వహించనప్పుడు కొవిడ్‌ ఉల్లంఘన కేసులు గుర్తుకు రాలేదా అని పోలీసులను ఆయన ప్రశ్నించారు. టీడీపీ కార్యకర్తలు ఎన్నికల్లో పాల్గొనకుండా చేసేందుకు వైసీపీ ప్రభుత్వం కుట్ర పన్నుతోందని విమ ర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా బెదరకుండా పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తామని, సత్తా చాటుతామని దీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచు కేఈ రాంబాబు, పార్టీ మండల కన్వీనర్‌ కేఈ మల్లికా ర్జునగౌడ్‌, మాజీ సింగిల్‌ విండో అధ్యక్షుడు హేమాద్రిరెడ్డి, నాయకులు మధు సూదన్‌ రెడ్డి, గోపాల్‌నాయుడు, ఎల్లప్పనాయుడు, వేణుగోపాల్‌రెడ్డి, అమడ గుంట్ల వెంకటేశ్వర్లు, చిల్లబండ బాషా తదితరులు పాల్గొన్నారు.  

Updated Date - 2021-01-26T05:58:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising