ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలి: టీడీపీ

ABN, First Publish Date - 2021-06-17T05:09:26+05:30

ముఖ్యమంత్రి జగన్‌కు రాయలసీమ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు.

శ్రీశైలంలో మాట్లాడుతున్న సోమిశెట్టి వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కర్నూలు(అగ్రికల్చర్‌), జూన్‌ 16: ముఖ్యమంత్రి జగన్‌కు రాయలసీమ అభివృద్ధిపై ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని టీడీపీ కర్నూలు లోక్‌సభ నియోజకవర్గ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. బుధవారం ఆయన శ్రీశైలానికి వెళ్లారు. అక్కడ విలేకరులతో మాట్లాడారు. కేంద్రంతో మాట్లాడి హైకోర్టును తీసుకురావడంలో సీఎం జగన్‌, వైసీపీకి చెందిన 22 మంది ఎంపీలు విఫలమయ్యారని ఆరోపించారు. సీఎం జగన్‌ కేంద్రం నుంచి నిధులు తీసుకురావడం లేదని, కేవలం తనపై సీబీఐ కోర్టులో ఉన్న కేసులను మాఫీ చేయించుకోవడానికే ఢిల్లీ పెద్దలతో మంతనాలు చేస్తున్నట్లు తెలుస్తోందని సోమిశెట్టి ఆరోపించారు. కరోనా మహమ్మారి కారణంగా చనిపోయిన మృతుల కుటుంబాలను ముఖ్యమంత్రి జగన్‌ తక్షణమే ఆదుకోవాలని, ఆ కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేశారు. జర్నలిస్టులకు రూ.25 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు. నాయకులు నాగేంద్ర కుమార్‌, నారాయణ రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-17T05:09:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising