ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నేటినుంచి పోలీసులకు కొవిడ్‌ టీకా

ABN, First Publish Date - 2021-02-24T06:14:50+05:30

జిల్లాలో పోలీసులు, హోంగార్డులు, ఏపీఎస్సీ బెటాలియన్‌, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బందికి బుధవారం నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.కె.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  1. 6,279 మంది పోలీసుల గుర్తింపు
  2. ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.వెంకటరమణ

    కర్నూలు(హాస్పిటల్‌), ఫిబ్రవరి 23: జిల్లాలో పోలీసులు, హోంగార్డులు, ఏపీఎస్సీ బెటాలియన్‌, జైళ్ల శాఖ, అగ్నిమాపక శాఖ సిబ్బందికి బుధవారం నుంచి కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయనున్నట్లు ఇన్‌చార్జి డీఎంహెచ్‌వో డా.కె.వెంకటరమణ ఓ ప్రకటనలో తెలిపారు. జిల్లాలో 6,279 మంది పోలీసులు ఉన్నారన్నారు. పీహెచ్‌సీ, సీహెచ్‌సీలతో పాటు ఏపీఎస్పీ బెటాలియన్‌, జిల్లా ఎస్పీ కార్యాలయం, కర్నూలు జీజీహెచ్‌లో టీకా కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. టీకా వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవని, కొద్దిమందిలో మాత్రం ఒళ్లునొప్పులు, జ్వరం వచ్చినా వెంటనే తగ్గిపోతాయని అన్నారు. మొదటి డోసు వేసుకున్న వారు 28 రోజుల వ్యవధిలో రెండో డోసులు తప్పనిసరిగా వేయించుకోవాలని సూచించారు. హెల్త్‌కేర్‌ వర్కర్లకు కొవిడ్‌ టీకా మొదటి డోసు వేసుకోవడానికి ఫిబ్రవరి 25 వరకు గడువు ఉందన్నారు.

    జీరో కేసులు
    జిల్లాలో గత 24 గంటల్లో 1405 మందికి కొవిడ్‌ పరీక్షలు నిర్వహించగా అందరికీ నెగిటివ్‌ రిపోర్టులు వచ్చింది. ఇప్పటి వరకు జిల్లాలో బాధితుల సంఖ్య 60,860కు చేరగా 13 మంది కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 60,358 మంది డిశ్చార్జి అయ్యారు.

    876 మందికి టీకాలు
    జిల్లాలో 2787 మంది హెల్త్‌కేర్‌, ఫ్రంట్‌ లైన్‌ వర్కర్స్‌కు కొవిడ్‌ టీకాలు వేయాల్సి ఉండగా మంగళవారం 876 మందికి వ్యాక్సిన్‌ వేసినట్లు డీఎంహెచ్‌వో తెలిపారు.

Updated Date - 2021-02-24T06:14:50+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising